Allari naresh : పవన్ కళ్యాణ్ పార్టీపై, రాజకీయాలపై స్పందించిన నరేష్..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ రాజకీయాలపై వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి, మీరు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారా అని అడగగా నరేష్.......................

Allari naresh : పవన్ కళ్యాణ్ పార్టీపై, రాజకీయాలపై స్పందించిన నరేష్..

Allari naresh comments on Politics

Updated On : November 25, 2022 / 9:39 AM IST

Allari naresh :  కామెడీ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన అల్లరి నరేష్ నాంది సినిమా నుంచి తన పంథా మార్చేశారు. సీరియస్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు. తాజాగా నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. మరోసారి కంటెంట్ సినిమాతో నరేష్ వస్తుండటంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని దర్శకుడు ఏఆర్ మోహన్ సినిమాని తెరకెక్కించగా ఆనంది హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ రాజకీయాలపై వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి, మీరు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారా అని అడగగా నరేష్ సమాధానమిస్తూ.. ”అసలు నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రస్తుతం పూర్తిస్థాయి నటుడిగా విజయం సాధించాలని ఉంది. భవిష్యత్తులో డైరెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. నాలాంటి వాళ్ళు అసలు రాజకీయాలకి పనికిరారు” అని తెలిపారు.

Rashmi Gautam : ముంబై నుంచి వస్తేనే తీసుకుంటారు.. టాలీవుడ్‌పై రష్మి కౌంటర్

ఈ సినిమా రాజకీయనాయకుల్లో, వ్యవస్థలో మార్పు తెచ్చే అంశం అని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఆయన పార్టీపై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా.. ”రాజకీయాలు నాకు అసలు పరిచయం లేదు. కానీ వ్యవస్థలో ఎవరు మంచి మార్పు కోసం పనిచేసినా మనం అభినందించాలి” అని అన్నారు.