Allahabad HC : దళిత విద్యార్థిని IIT ఫీజు కట్టిన జస్టిస్ దినేష్ కుమార్ సింగ్..ఆమెకు స్పెషల్ సీటు కేటాయించాలని ఆదేశం

దళిత విద్యార్థిని IIT ఫీజు కోసం డబ్బులిచ్చారు జస్టిస్ దినేష్ కుమార్ సింగ్. పేదరికంతా ఆమె చదవుకు ఆగిపోకూడదని ఆమెకు స్పెషల్ సీటు కేటాయించాలని యూనివర్శిటీకి ఆదేశాలు జారీ చేశారు.

Justice Dinesh Kumar Singh Dalit Girl Student Seat Failure Submit Rs.15000

Justice Dinesh Kumar Singh dalit girl student seat failure submit Rs.15000: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఓ పేద విద్యార్థిని ప్రతిభకు ముగ్ధుడైపోయారు. విద్యార్థిని ఐఐటీ ఫీజు కోసం జస్టిస్ దినేష్ కుమార్ సింగ్ రూ.15,000 ఇచ్చారు. అంతేకాదు..పేదరికం వల్ల ఆ బాలిక ప్రతిభ అక్కడితో ఆగిపోకూడదని..వెంటనే ఆమెను కాలేజీలో చేర్చుకోవాలని..సీటు లేకపోతే ప్రత్యేకించి ఓ సీటు కేటాయించి ఆమెను చేర్చుకోవాలని..ఆదేశించారు. అంతేకాదు..ఆ విద్యార్థిని మూడు రోజుల్లోగా చేర్చుకోవాలని..సీటు ఖాళీగా లేకపోతే, ఆమెకు ప్రత్యేక సీటు ఏర్పాటు చేయాలని జాయింట్ సీట్ల కేటాయింపు అథారిటీ,ఐఐటి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) కి ఆదేశాలు జారీ చేశారు.

కాగా..తనకు చదువుకోవాలని ఎంతో ఆశగా ఉందని..కానీ తన పేదరికం వల్ల ఐఐటీలో సీటు వచ్చినా ఫీజు కట్టలేక జాయిన్ కాలేకపోతున్నానని కానా తన చదువు ఆగిపోతే ఇక జీవితంలో తాను చదువుకోలేనేమో అనే ఆవేదన వ్యక్తం చేస్తు.. విద్యార్థి సంస్కృతి రంజన్‌ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్ దినేష్ కుమార్ సింగ్ సోమవారం (నవంబర్ 29,2021) ఆమెను వెంటనే యూనివర్శిటీలో జాయిన్ చేసుకోవాలని బెనారస్ వర్శిటీకి ఉత్తర్వులు జారీ చేశారు.17 ఏళ్ల విద్యార్థిని పేదరికంతో తన కోసం న్యాయవాదిని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయింది. కోర్టు ఆదేశం మేరకు..న్యాయవాదులు సర్వేష్ దూబే, సమ్తా రావు ముందుకు వచ్చి విద్యార్థి తరపు వాదనను కోర్టుకు అందించడంలో మద్దతు ఇచ్చారు.

Read more :  Pakistan Gwadar: పాకిస్థాన్ గ్వాదర్ పోర్టులో చైనా చేపల వేట..ప్రజల ఆందోళనలతో అట్టుడుకున్న పాక్

విద్యార్థి సంస్కృతి రంజన్‌ కు 1469వ ర్యాంకు..
విద్యార్థి సంస్కృతి రంజన్‌ దళితురాలు. 10th classలో 95 శాతం మార్కులు తెచ్చుకుంది. ఇంటర్లో 94 శాతం మార్కులు సాధించింది. ఆమె జేఈఈ పరీక్షకు హాజరై మెయిన్స్‌లో 92 శాతం మార్కులు సాధించింది. ఎస్సీ కేటగిరీలో 2062వ ర్యాంకు సాధించింది. ఆ తర్వాత ఆమె JEE అడ్వాన్స్‌డ్ పరీక్షలో హాజరయ్యింది. 1469 ర్యాంక్ వచ్చింది. లెక్కలు, కంప్యూటర్‌కు సంబంధించిన ఐదేళ్ల కోర్సులో IIT BHU లో సీటు కేటాయించబడింది. కానీ ఆమె అడ్మిషన్‌ కోసం కట్టాల్సిన రూ.15 వేలు కూడా కట్టలేని పేదరికం ఆమెది. అడ్మిషన్ ఫీజు కట్టాల్సిన నిర్ణీత గడువు కూడా దాటిపోయింది. దీంతో ఆమె తను ఫీజు కట్టటానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరింది. కానీ కుదరదని చెప్పింది వర్శిటీ. దీంతో ఆమె ఇంతకాలం చదివిన చదువు నిరుపయోగంగా అయిపోతుందనే ఆవేదనతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. తనకు మరికొంత సమయం ఇస్తే ఎలాగోలా అడ్మిషన్ ఫీజు కటడతానని దయచేసి తనకు ఈ అవకాశం ఇప్పించాల్సిందిగా ధర్మాసనాన్ని కోరింది సంస్కృతి రంజన్‌.

Read more : కిషన్-రెడ్డిపై-ఎమ్మెల్యే-జీవన్-రెడ్డి-ఫైర్

ఓ పక్క తండ్రి అనారోగ్యం..కోవిడ్ తో మరణం..విద్యార్థిని ఆవేదన..
విద్యార్థిని సంస్కృతి రంజన్‌ తన తండ్రి కిడ్నీ చెడిపోయిందని..తన కిడ్నీని తండ్రి అమర్చాలని పిటిషన్‌లో పేర్కొంది. తండ్రికి ప్రస్తుతం వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చేయించుకుంటున్నారనీ..అటువంటి పరిస్థితిలో..ఆమె తండ్రి అనారోగ్యానికి తోడు ఆయన కరోనా బారిన పడి మరణించాడని..దీంతో తమ కుటుంబం ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని.. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో సకాలంలో ఫీజు జమ చేయలేకపోయానని కోర్టుకు విన్నవించుకుంది.

ఇటువంటి పరిస్థితుల్లో తనకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ జాయింట్‌ సీట్‌ అలోకేషన్‌ అథారిటీకి పలుమార్లు లేఖలు రాసినా తన లేఖకు ఎలాంటి సమాధానం రాలేదని పిటిషన్‌లో పేర్కొంది. అటువంటి పరిస్థితిలో నాకు కోర్టు ఆశ్రయించటం తప్ప వేరే దారి కనిపించలేదని వాపోయింది. దీంతో ఆమె దీన గాథ విన్న జస్టిస్ జస్టిస్ దినేష్ కుమార్ సింగ్ చలించిపోయారు. ఆమెకు తనవంతుగా రూ.15,000 ఆర్థిక సహాయం చేస్తు ఆమెను మూడు రోజుల్లో వర్శిటీలో చేర్చుకోవాలని బెంగళూరు యూనివర్శిటీకి ఆదేశాలు జారీ చేశారు. ఆమెను వెంటనే వర్శిటీలో చేర్చేలా చూడాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.