Pakistan Gwadar: పాకిస్థాన్ గ్వాదర్ పోర్టులో చైనా చేపల వేట..ప్రజల ఆందోళనలతో అట్టుడుకున్న పాక్
పాకిస్థాన్ గ్వాదర్ పోర్టులో చైనా చేపల వేట సాగిస్తోంది దీంతో ..మా మత్స్య సంపదను చైనా దోచేస్తుందంటు పాక్ ప్రజలు భారీగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

Protests In Pakistan's Gwadar Against China Illegal Fishing
pakistan Gwadar port : పాకిస్థాన్ మత్స్య సంపదను చైనా దోచేస్తోందంటూ పాకిస్థాన్ ప్రజలు ఆందోళన చేపట్టారు. బలూచిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టులో డ్రాగన్ దేశం భారీ నౌకలతో చేపల వేట సాగిస్తోంది. దీంతో పాకిస్థాన్ ప్రజలు చైనా పాక్ ఎకనమిక్ కారిడార్‌పై ఆందోళనలు చేపట్టారు. పాక్ ప్రభుత్వం చైనాతో అంటకాగి తమకు ఉపాధి లేకుండా చేస్తోందంటూ వారం పది రోజులుగా గ్వాదర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. చిన్నారులతో పాటు మహిళలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. భారీ నిరసనలతో గ్వాదర్ పోర్టు హోరెత్తిపోతోంది.బలూచిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టులో తమ సహజ సంపదలను చైనీయులు దోచేయడంతో స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో గత వారం పది రోజుల నుంచి గ్వాదర్ చుట్టుపక్కల ప్రాంతాలు ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. ఈక్రమంలో ఆందోళనలకు మరింత ఉదృతం చేయటానికి మంగళవారం (నవంబర్ 29,2021) చిన్నపిల్లలు, మహిళలు గ్వాదర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు.
చైనా టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనాకు పరాయి దేశాలమీద ఆధిపత్యం కోసం ఏం చేయాలో కూడా తెలుసు. మొదటిగా ఏ దేశాలైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాయో ఆ దేశాలపై చైనా కన్ను వేస్తుంది. వారి ఆర్ధిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని స్నేహం..సత్సంబంధాల పేరుతో పక్కా ప్లాన్ తో వారిని వచించటం చైనాకు అలవాటే. శతృవుకు శతృవు మిత్రుడు అన్నట్లుగా చైనా వ్యవహారం ఉంటుంది. ఈ క్రమంలో పొరుగు దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవానికి పన్నాగాలు పన్నుతుంది. దాంట్లో భాగంగానే చైనా డ్రాగన్ ఇటీవల పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ ఏర్పాటు చేసింది.ఈ ప్రాజెక్టు పేరుతో పాక్ భూభాగంపై ఆధిపత్యం చెలాయించడం..ఆ కాస్త పట్టు సాధించాక..స్థానిక ప్రజల్నే పరాయివారిగా చూడటం మొదలుపెడుతుంది. అక్కడ స్థలం తమదే అన్నట్లుగా పెత్తనం చెలాయిస్తుంది. దీంట్లో భాగంగానే గత కొన్ని నెలల క్రితం చైనా తన భారీ నౌకలతో గ్వాదర్ పోర్టులో చేపల వేట మొదలు పెట్టింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. కారణం వారు అక్కడ చేపల వేటతోనే జీవనం సాగిస్తుంటారు. గ్వాదర్ ప్రాంతంలో దాదాపు 20 లక్షల మంది ప్రజలు చేపల వేటపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు.దీంతో చైనా తమ మత్స్య సంపద దోచేస్తోందంటూ ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తు ఆందోళన చేపట్టారు.
Baloch women chanted loud “Terrorist
state Pakistan” during women protest in #Gwadar pic.twitter.com/HQDpNcFc80— Noora Baloch (@noorabaloch2) November 29, 2021
Read more : China on Pakistan: పాక్ కొంపముంచిన చైనాతో దోస్తీ
చైనాతో అంటకాగిన పాకిస్థాన ఇప్పుడు ఆందోళనలతో అట్టుడుకుతోంది. 2021 జూన్‌లో వందల కొద్దీ చైనా నౌకలు గ్వాదర్ పోర్టుకు చేరుకున్నాయి. ఆ నౌకలు సాధారణ నౌకలు కాదు ఏకంగా..యుద్ధనౌకలంత పెద్దవి. అలా అక్కడ చేపల వేట సాగిస్తున్నాయి. దీంతో స్థానిక మత్స్యకారులు హడలెత్తిపోయారు. పాక్‌కు చెందిన అజాదీ న్యూస్ చైనా పడవలు చేపల వేటను చేపట్టిన ఫోటోలను ప్రసారం చేసింది. ఈ పడవలు అన్నీ చేపల ఎగుమతి సంస్థకు చెందినవిగా గుర్తించారు.స్థానికులు ఆందోళనకు దిగడంతో కొన్నాళ్లక్రితం చేపలతో సహా5 నౌకలను పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైనా చేపట్టిన ఒన్ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. గ్వాదర్‌లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను తొలగించాలని.. చైనా చేపల వేటకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దీనికి జమాతే ఇస్లాం బలూచిస్థాన్ జనరల్ సెక్రటరీ హిదాయత్ ఉర్ రహ్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
స్థానిక విషయాల్లో చైనా జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డ్రాగన్ తమ సహజ సంపదను దోచుకుంటోందని ఆరోపిస్తున్నారు. దీంట్లో భాగంగానే కొన్ని వారాలుగా భారీ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మా దేశానికి వచ్చి మా స్థానికులనే పరాయి వారిగా చేసి చైనా పెత్తనం చెలాయిస్తోందని..చేపల వేట సాగించే నౌకలకు పాక్ ప్రభుత్వం అనుమతులు ఇస్తోందని వారు ఆరోపిస్తున్నారు. నీరు, విద్యుత్తు వంటి కనీస సౌకర్యాలు కూడా పాక్ ప్రజలకు కల్పించని పాక్ చైనాకు మాత్రం స్వదేశీయులపై పెత్తనం చేయటానికి అనుమతులు ఇస్తోందంటూ తిట్టిపోస్తున్నారు.
A huge gathering today in #Gwadar, where thousands of Baloch women, children participated for basic rights of Gwadar and support of ongoing protest by @MHidayatRehman from 2 weeks, where he presented a list of 14 demands for Justice to Gwadar pic.twitter.com/XdVfpBVvJB
— Noora Baloch (@noorabaloch2) November 29, 2021
Read more : Harish Rao : కేంద్ర మంత్రులు చెప్పేవన్నీ అబద్ధాలే – హరీష్ రావు
సిపెక్ ప్రాజెక్టు ఉన్న గ్వాదర్ నగరం చుట్టూ చైనా ఏకంగా 10 అడుగుల ఎత్తున 30 కిలోమీటర్ల మేరకు ఇనుప కంచె నిర్మాణం చేపట్టింది చైనా. 9 వేల మంది పాక్ సైనికులు, 6 వేల మంది చైనా సైనికులు సీపెక్ ప్రాజెక్టు వద్ద సెక్యురిటీగా పనిచేస్తున్నారు. ఇప్పటికే గ్వాదర్ పోర్టును చైనా కంపెనీలకు 40ఏళ్లపాటు లీజుకు ఇచ్చేసింది. 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో చైనా ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న సీపీఈసీ ప్రాజెక్టు.. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ లోని గ్వాదర్ పోర్టు నుంచి చైనాలోని గ్జిన్‌జియాంగ్ ప్రావిన్సును కలుపుతుంది. ప్రాజెక్టులో భాగంగా మౌలిక వసతుల నిర్మాణాల కోసం పాకిస్థఆన్ కు 60 బిలియన్ డాలర్లు ఇస్తామని చైనా చెప్పింది. కానీ ఈ సీపీఈసీ ప్రాజెక్టు పీవోకే ద్వారా వెళ్లడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది.కాగా..చైనా 2015లో ప్రారంభించిన చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ అనేది ఆ దేశంలోని చారిత్రాత్మక వాణిజ్య మార్గాలను పునరుద్ధరించే లక్ష్యంతో ఒన్ బెల్ట్ ఒన్ రోడ్డులో భాగంగా చేపట్టింది.