China on Pakistan: పాక్ కొంపముంచిన చైనాతో దోస్తీ

ఆదుకుంటుంది కదా అని స్నేహం చేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టేలా మారింది చైనా వైఖరి. భారత్ తో ఆర్థిక లావాదేవీలు తెగదెంపులు అయిపోయాక చైనా నుంచి మద్ధతు..

China on Pakistan: పాక్ కొంపముంచిన చైనాతో దోస్తీ

Pakistan China

China on Pakistan: ఆదుకుంటుంది కదా అని స్నేహం చేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టేలా మారింది చైనా వైఖరి. భారత్ తో ఆర్థిక లావాదేవీలు తెగదెంపులు అయిపోయాక చైనా నుంచి మద్ధతు లభించింది పాకిస్తాన్‌కు. అంతేకాకుండా కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న సమయంలోనూ.. పాక్ పౌరులకు వ్యాక్సిన్ అందించిన చైనా దోస్తీ కుదుర్చుకుంది.

ఫైనాన్షిల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌లో భాగంగా పాక్‌ను అమెరికా గ్రే లిస్ట్‌లో పెట్టేయడంతో.. అక్కడ నుంచి అదే ఆర్థిక సహాయం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో డ్రాగన్‌ దేశంతో పాక్ మరింత దగ్గరైంది. అదే సమయంలో చైనాకు చెందిన టెక్‌ దిగ్గజం Huawei పాకిస్థాన్‌ ప్రజలపై ఫోకస్ పెట్టిన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన సెన్సిటివ్ డేటాను యాక్సెస్‌ చేసినట్లుగా వార్తలు బయటికొచ్చాయి. పాకిస్థాన్‌‌కు చెందిన కమర్షియల్ సీక్రెట్స్‌ను దొంగిలించి ఆ దేశస్థులపై నిఘా పెట్టిందని అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బిజినెస్‌ ఎఫిషియెన్సీ సొల్యూషన్స్‌ ఆరోపించింది.

పాక్ ప్రభుత్వం కోసం బిజినెస్‌ ఎఫిషియెన్సీ సొల్యూషన్స్‌ సంస్థ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను రెడీ చేసింది. సాఫ్ట్‌వేర్‌ పూర్తైన తర్వాత పాకిస్థాన్‌ దేశపు సమాచారాన్ని ట్రయల్‌ రన్‌ కోసం బీజింగ్‌కు పంపింది. ఇప్పటివరకు Huawei పాకిస్థాన్‌కు చెందిన సమాచారాన్ని తిరిగి ఇవ్వలేదని బిజినెస్‌ ఎఫిషియెన్సీ సొల్యూషన్స్‌ ఆరోపించింది. ఈ విషయంపై కాలిఫోర్నియా కోర్టులో విచారణ జరపాలంటూ ఆరోపించింది ఆ సంస్థ.

పిటిషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన కీలక సమాచారాన్ని Huawei బ్యాక్‌డోర్‌ ద్వారా సేకరిస్తుందంటూ పేర్కొంది. పాకిస్థాన్‌పై చైనా కేవలం నిఘా మాత్రమే ఉంచిదనుకుంటే పొరబాటే. మిడిల్‌-ఈస్ట్‌ దేశాలపై కూడా చైనా సైబర్‌ దాడులు చేస్తోందని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఫైర్‌ఐ వెల్లడించింది.