Amazon Great Freedom Festival : ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఆ రోజు నుంచే ప్రారంభం!
కస్టమర్లకు దగ్గరయ్యేందుకు ఈ - కామెర్స్ సంస్థలు భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. గత నెలలో ప్రైమ్ డే, బిగ్ సేవింగ్ సేల్ నిర్వహించాయి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు. ఈ సేల్ లో భారీ డిస్కౌంట్లు ఇచ్చాయి. ఇక ఆగస్టులో కూడా ఇటువంటి సేల్ నిర్వహించనుంది అమెజాన్. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో ఆగస్టు 5 నుంచి 9 వరకు ఈ సేల్ ను నిర్వహించనున్నారు.
- kunduru Vinod
- Published On : August 3, 2021 / 06:54 PM IST
Amazon Great Freedom Festival
Amazon : కస్టమర్లకు దగ్గరయ్యేందుకు ఈ – కామెర్స్ సంస్థలు భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. గత నెలలో ప్రైమ్ డే, బిగ్ సేవింగ్ సేల్ నిర్వహించాయి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు. ఈ సేల్ లో భారీ డిస్కౌంట్లు ఇచ్చాయి. ఇక ఆగస్టులో కూడా ఇటువంటి సేల్ నిర్వహించనుంది అమెజాన్. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో ఆగస్టు 5 నుంచి 9 వరకు ఈ సేల్ ను నిర్వహించనున్నారు.
ఐదురోజులపాటు ఉండే ఈ సేల్ లో బంపర్ ఆఫర్లు ఇవ్వనుంది అమెజాన్. ముఖ్యంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వాటి యాక్సెసరీస్ ను ఆర్డర్ చేయాలనుకునే వారికి ఇది పండుగే అని చెప్పవచ్చు. మొబైల్స్, వాటి యాక్సెసరీస్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్ ను ఈ సేల్ లో అమెజాన్ అందించనుంది. ఎలక్ట్రానిక్స్, వాటి యాక్సెసరీస్ మీద 60 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.
టీవీలు, వాటి అప్లయెన్సెస్ కు 55 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఆర్ధర్ చేస్తే.. మరో పదిశాతం అదనంగా 10 శాతం డిస్కౌంట్ ను అందించనున్నారు. లాప్ టాప్ పై రూ.30 వేల వరకు డిస్కౌంట్ ను ఈ సేల్ లో పొందవచ్చు.
ఇక అమెజాన్ ప్రైమ్ ఉన్నవారికి అదనంగా మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కల్పించారు. ఇక ఈ సేల్ లో కొత్త లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లు వన్ ప్లస్ నోర్డ్ 2, వన్ ప్లస్ నోర్డ్ సీఈ 5జీ, సామ్ సంగ్ ఎం21 2021, ఐక్యూఓఓ జెడ్3, 5జీ ఫోన్లను కూడా అందుబాటులో ఉంచనుంది అమెజాన్.. ఇక కొత్త ఫోన్స్, లాప్ టాప్స్ తోపాటు ఎలక్ట్రిక్ వస్తువులు కొనాలి అనుకునే వారికి ఈ సేల్ పండుగే అని చెప్పొచ్చు. తాజాగా జరిగిన అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో కంటే ఇందులోనే ఎక్కువ ఆఫర్లు కనిపిస్తున్నాయి.
