Ambati Rambabu Old Photos Goes Viral In Social Media
Viral Photo: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్‌గా మారుతుందో ఎవరికీ తెలియదు. అయితే ఎప్పుడో సరదా కోసం చేసిన పని, ఆ తరువాత కాలంలో వైరల్ అవుతుందని ఎవరూ ఊహించరు. ఇప్పుడు ఓ ప్రముఖ వ్యక్తి విషయంలోనూ ఇదే జరిగింది. ప్రస్తుతం ఆయనొక రాజకీయ నేత. ఆయనే అంబటి రాంబాబు. ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా, వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేస్తున్నారు.
Ambati Rambabu: పవన్ ఎప్పటికీ ఒకరి పల్లకీ మోసే నాయకుడిగానే మిగిలిపోతాడు: అంబటి రాంబాబు
ఇలాంటి అంబటి రాంబాబుకు సినిమా రంగంలో మంచి పరిచయాలు ఉన్నాయి. అయితే గతంలో అంబటి రాంబాబు సినిమాల్లోనూ నటించారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన యుక్తవయసులో ఉన్నప్పుడు ఓ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో ఆసక్తి ఉండటంతో గతంలో ఆయన సినిమాల్లో నటించినట్లు ఈ ఫోటోలు చూస్తే అర్థం అవుతోంది.
Ambati Rambabu Old Photos Goes Viral In Social Media001
అయితే అంబటి రాంబాబు నటించిన సినిమా ఏమిటి.. ఈ ఫోటోల్లో ఆయన పక్కన ఉన్న హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. ఆయన వయసులో ఉన్నప్పుడు పలు సినిమాలతో పాటు సీరియల్స్‌లో కూడా నటించారని తెలుస్తోంది. ఆయన సినిమాల్లో నటించినప్పటి ఫోటోలు ఇప్పుడు బయటకు రావడంతో.. అంబటి రాంబాబు నెట్టింట మరోసారి వైరల్‌గా మారిపోయారు. ఇక సినిమా ఇండస్ట్రీలో అంబటి రాంబాబుకు చాలా మంది సన్నిహితులు ఉన్నారు. వారిలో జీవితా రాజశేఖర్, రాజశేఖర్ కూడా ఉన్నారు. నిజానికి వారిని వైసీపీలో చేరేలా చేసింది అంబటి రాంబాబు అన్న విషయం అందరికీ తెలిసిందే.