Ambati Rambabu: పవన్ ఎప్పటికీ ఒకరి పల్లకీ మోసే నాయకుడిగానే మిగిలిపోతాడు: అంబటి రాంబాబు

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు బుధవారం స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూసి భయపడాల్సిన అవసరం మాకేంటి..? అని అంబటి రాంబాబు

Ambati Rambabu: పవన్ ఎప్పటికీ ఒకరి పల్లకీ మోసే నాయకుడిగానే మిగిలిపోతాడు: అంబటి రాంబాబు

Ambati

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ఇకపై అధికారంలోకి రాదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీపై వరుసగా మాటల యుద్ధం చేస్తున్న పవన్..అధికార వైకాపా ప్రజలకు మంచే చేసిందని భావిస్తే..జనసేనను చూసి భయపడడం ఎందుకూ? అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు బుధవారం స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూసి భయపడాల్సిన అవసరం మాకేంటి..? అని అంబటి రాంబాబు అన్నారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ అంటే మాకు భయం లేదని ఎమ్మెల్యే అంబటి స్పష్టం చేశారు. పవన్, బీజేపీ, చంద్రబాబు కట్టగట్టుకుని వచ్చినా మాకు భయపడే అవసరంలేదని కూడా అంబటి రాంబాబు అన్నారు. ప్రజల పల్లకి కాదు.. చంద్రబాబు పల్లకి మోయడానికే జనసేన ఆవిర్భవించిందంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Also Read:Ap High Court : చదునైన పాదం ఉంటే ఆ ఉద్యోగానికి అనర్హులు : హైకోర్టు ఆసక్తికర తీర్పు

2014 నుండి జనసేన నడక, నడవడికను ప్రజలందరూ గమనిస్తున్నారని..త్వరలోనే జనసేన పార్టీని టీడీపీతో లంకె వేస్తావని మీ పార్టీ నేతలే భయపడుతున్నారంటూ పవన్ కు చురకలంటించారు అంబటి. 2019లో టీడీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకే ఒంటరిగా పోటీ చేసిన పవన్..ఇప్పుడు వ్యతిరేక ఓట్లు చీలకుండా కాపాడి ఎవరిని సీఎం చేద్దాం అనుకుంటున్నావ్ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. “సీఎం అయ్యేది నువ్వా..లేక చంద్రబాబుని సీఎం చెయ్యడానికా? ఈ విషయం జనసైనికులకు చెప్పు” అంటూ ఎమ్మెల్యే అంబటి పవన్ పై విమర్శలు సంధించారు. వ్యూహం నీకు వదిలేస్తే చంద్రబాబుతో లెక్కలు మాట్లాడుకుంటావా? అంటూ ఎద్దేవా చేశారు. 2019లోనూ వైసీపీ అధికారంలోకి రాదని పవన్ శపథం చేసాడని అది జరగలేదని అంబటి అన్నారు. 2024లోనూ వైసీపీ అధికారంలోకి రావడం సత్యమని ఇది పవన్ కళ్యాణ్ రాసి పెట్టుకోవాలన్న అంబటి రాంబాబు..పవన్ ఎప్పటికీ ఒకరి పల్లకి మోసే నాయకుడిగానే మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు.

Also read:AB Venakteswar Rao: ప్రభుత్వ షోకాజుపై గట్టి వివరణ ఇచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు