Ap High Court : చదునైన పాదం ఉంటే ఆ ఉద్యోగానికి అనర్హులు : హైకోర్టు ఆసక్తికర తీర్పు

చదునైన పాదం ఉంటే అటువంటి ఉద్యోగానికి అనర్హులు అంటూ హైకోర్టు ఆసక్తికర తీర్పు వెల్లడించింది.

Ap High Court : చదునైన పాదం ఉంటే ఆ ఉద్యోగానికి అనర్హులు : హైకోర్టు ఆసక్తికర తీర్పు

Ap Hc Says Person With Flat Feet Can’t Be Amvi

AP HC says person with flat feet can’t be AMVI : ఏపీ హైకోర్టు ఓ ఆసక్తికర తీర్పుని వెల్లడించింది. సమతల పాదం (Flat‌ foot‌) కలిగిన వ్యక్తి అసిస్టెంట్ మోటార్‌ వాహన ఇన్‌స్పెక్టర్‌ (Assistant Motor Vehicle Inspector) (AMVI) గా ఎంపిక అయ్యేందుకు అనర్హులని హైకోర్టు ఆసక్తికర తీర్పునిచ్చింది. అదే సయమంలో సమతల పాదం కలిగి ఉండటం అంగవైకల్యం కాదు అని కూడా స్పష్టం చేసింది. పాదం సమతలంగా ఉన్న వ్యక్తి నడిచేటప్పుడు, పరిగెత్తే సమయంలో పట్టు ఉండదని ధర్మాసనం ఆసక్తికర అంశాలను వెల్లడించింది. పాదం అలా ఉండటం అంగవైకల్యం కానప్పటికీ.. ఏఎంవీఐగా విధుల నిర్వహణకు ఆటంకం కలుగుతుందని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. ఆ ఉద్యోగం (post) ఒకచోట స్థిరంగా ఉండి విధులు నిర్వహించేది కాదని.. పేర్కొన్న కోర్టు ఏఎంవీఐ నోటిఫికేషన్‌(AMVI Notification)ను రద్దు చేయాలన్న పిటిషనర్‌ వాదనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం తిరస్కరించి వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

Also read : AP Entrance Test : ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్.. పరీక్షలు ఎప్పటినుంచంటే?

రవాణాశాఖలో 23 ఏవీఎంఐలో 17 ఖాళీ పోస్టుల భర్తీకి 2018లో ప్రకటన జారీచేశారు. పూర్వ (ఉమ్మడి జిల్లా) కడప జిల్లాకు చెందిన నాగేశ్వరయ్య 2019లో జరిగిన పరీక్ష రాసి మెరిట్‌ లిస్ట్‌లో 300 మార్కులకు 194.26 మార్కులు సాధించి రెండో స్థానం సాధించారు. ఆ తరువాత మెడికల్‌ పరీక్షకు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో భాగంగా తన పేరు మినహా 21 మంది అబ్యర్ధుల జాబితాను ఏపీపీఎస్పీ విడుదల చేసింది. దాంట్లో తన పేరు లేకపోవడంతో నాగేశ్వరయ్య షాక్ అయ్యారు. దీంతో తాను ఎందుకు సెలెక్ట్ కాలేదోనని ఆందోళన పడ్డారు. ఎందుకు సెలెక్ట్ కాలేదోనని తెలుసుకోవాలనుకున్నారు. దాని కోసం నాగేశ్వరయ్య విచారించగా కుడికాలికి ‘చదునైన పాదం’ ఉండటమే కారణమని అధికారులు తెలిపారు. దీంతో ఆయన షాక్ అయ్యారు. ఇదికూడా కారణం అయి ఉంటుందోనని ఆశ్చర్యపోయారు. ఆ తరువాత న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. సమతల పాదం కలిగిన వారిని అనర్హులుగా పేర్కొనడం వారిపట్ల వివక్ష చూపడమేనని వాదించారు. ఈ విషయం తన క్లైంట్ కు అన్యాయం జరుగుతుందని దీన్ని న్యాయస్థానంగుర్తించాలని కోరుతూ..ఉద్యోగ ప్రకటనను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో రహదారులు-భవనాలశాఖ, ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు.

Also read :  Russia-ukraine war : యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాను శిక్షించండి..లేదంటే ఐరాసను మూసేయండి : జెలెన్‌స్కీ

వీటన్నింటినీ విన్న ధర్మాసనం.. చదరపు పాదం అనేది చట్ట నిర్వచనం ప్రకారం అంగ వైకల్యం (డిజెబిలిటీ) కాదని స్పష్టంచేసింది. ఈక్రమంలో పిటిషనర్‌కు దివ్యాంగుల రిజర్వేషన్‌ వర్తించే అంశం ఉత్పన్నం కాదని పేర్కొంది. మరోవైపు రవాణాశాఖలో చేపట్టే పోస్టులకు రిజర్వేషన్‌ వర్తించకుండా దివ్యాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్‌ 34(1) ద్వారా మినహాయింపు ఇచ్చారని గుర్తుచేసింది. ఏఎంవీఐ ఉద్యోగ ప్రకటన నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న పిటిషనర్‌ వాదనను తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. ఆ పోస్టు ఒకచోట ఉండి నిర్వహించేది కాదని, పలురకాల విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌ సబార్డినేట్‌ సర్వీసు నిబంధన 10(డి)(4), 2009 ఫిబ్రవరిలో ఇచ్చిన జీవో 71 ఫ్లాట్‌ ఫుట్‌ కలిగిన వారిని ఏఎంవీఐగా నియామకాన్ని నిలువరిస్తున్నాయని గుర్తుచేసింది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పిటిషన్‌ను కొట్టేస్తున్నామని ప్రకటించింది.