heatwave: పెరుగుతున్న ఎండలు.. జాగ్రత్తలు చెప్పిన కేంద్రం

దేశవ్యాప్తంగా ఎండలు పెరిగిపోతున్న దృష్ట్యా కేంద్రం అప్రమత్తమైంది. ఎండల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు పలు సూచనలు చేసింది.

heatwave: దేశవ్యాప్తంగా ఎండలు పెరిగిపోతున్న దృష్ట్యా కేంద్రం అప్రమత్తమైంది. ఎండల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు పలు సూచనలు చేసింది. కేంద్రం చేసిన కొన్ని సూచనలివి. రోజులో కావాల్సినన్ని నీళ్లు తాగాలి. అవసరమైతే ఓఆర్ఎస్ వంటి డ్రింక్స్ కూడా తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులే ధరించాలి. అవి కూడా లైట్ కలర్స్ మాత్రమే. బయటకు వెళ్లినప్పుడు తలపై టోపీ, హ్యాట్, టవల్, కర్చీఫ్ వంటివి ధరించాలి. గొడుగు వాడాలి. ఎండ నేరుగా తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండను భరించలేని వాళ్లు, పిల్లలు, గర్భిణులు, శిశువులు, మానసిక సమస్యలు ఉన్నవాళ్లు, ఎండలో, బయట పనిచేసేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Summer : ఎండలో బారాత్ కోసం కదిలే పెళ్లి పందిరి

ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లడాన్ని తగ్గించుకోవాలి. అందులోనూ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఈ సమయంలో ఆరుబయట వంట కూడా చేయకూడదు. మరోవైపు రాష్ట్రాలకు కూడా పలు సూచనలు చేసింది. ఎండ, వడగాడ్పుల విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. ప్రజలకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని చెప్పింది.

ట్రెండింగ్ వార్తలు