Summer : ఎండలో బారాత్ కోసం కదిలే పెళ్లి పందిరి
దేశంలో ఈ ఏడాది ఎండలు మండి పోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదే సమయంలో శుభముహూర్తాలు ఉన్నాయి.

Moveble Tent
Summer : దేశంలో ఈ ఏడాది ఎండలు మండి పోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదే సమయంలో శుభముహూర్తాలు ఉన్నాయి. ఎండాకాలంలో పెళ్ళి అంటే ఎంత ఉక్కపోతగా ఉంటుందో… దానికి వచ్చే అతిధులు ఎండ వేడిమికి ఎలా ఉక్కిరి బిక్కిరి అయిపోతారో వేరే చెప్పక్కర్లేదు.
ఇంక పెళ్లి బారాత్ ఉందంటే ఎండలో ఆనందాన్ని ఎంజాయ్ చేయాలంటే వీలుకాదు. బుర్ర ఉండాలే కానీ ఏదో ఒక ఉపాయం తట్టక పోతుందా… సూరత్ లో ఒక పెళ్లి బృందం ఇదే చేసింది. ఈ ఎండాకాలంలో పగలు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి బారాత్ నిర్వహించాలి… ఎండలో పెళ్లి కొడుకును ఊరేగింపుగా తీసుకురావటం… బంధుమిత్రులు కూడా రోడ్డు మీద నడిచి రావాలంటే ఎండ వేడిమిని భరించాలి.
Also Read : Coal Shortage : విద్యుత్ సంక్షోభం.. 650 రైళ్లు రద్దు!
ఎవరికీ ఇబ్బంది కలుగకుండా ఆహ్లాదంగా ఉండేలా ఆ పెళ్లి బృందం కాస్త తెలివితో నడిచే పందిరి తయారు చేయించారు. పెళ్లి బారాత్ నిర్వహించారు. పందిరి కింద ప్రతి ఒక్కరూ ఆనందంగా డ్యాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈవీడియోను రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వరుడు గుర్రంపై ఊరేగుతుండగా… కదిలే పందిరి కింద బంధువులు అంతా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేసారు. వారికి ఎండ తగలకుండా పందిరి నాలుగు మూలలా నలుగురు యువకులు పందిరిని ముందుకు నడుపుతూ కదిలారు. ఈవీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నార్…. వాట్ ఎన్ ఐడియా అంటూ మెచ్చుకుంటున్నారు. ఇండియన్స్ అంటేనే క్రియేటివిటీ అంటూ మెచ్చుకుంటున్నారు.
Sun shade and mobile secure enclosure for barat. Innovations galore pic.twitter.com/rdxUV45Qfg
— Aviator Anil Chopra (@Chopsyturvey) April 27, 2022