BIG B ’specially-abled’ fan : పాదాలతో అబితాబ్ బొమ్మ వేసిన యువకుడు..ఫిదా అయిన బిగ్ బీ
పాదాలతో అబితాబ్ బొమ్మ వేసిన యువకుడి ప్రతిభకు బిగ్ బీ ఫిదా అయిపోయారు. ఆ ఆర్టిస్టును అభినందించారు. ప్రశంసలతో ముంచెత్తారు.
- nagamani
- Published On : September 27, 2021 / 01:52 PM IST
Big B 'specially Abled' Fan
BIG B ’specially-abled’ fan : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది. ఓ చేతులు లేని ఓ యువకుడు అబితాబ్ బొమ్మ గీయగా..ఆ చిత్రాన్ని బిగ్ బీ తన తన సోషల్ మీడియాలో షేర్ చేస్తు ఆ యువకుడికి అభినందనలు తెలిపారు. ప్రశంసలు కురిపించారు.
అమితాబ్ నటించిన ‘గులాబో సితాబో’ సినిమా నుంచి ఆయన లుక్‌ని ఆ యువకుడు కాళ్లతో చిత్రాన్ని గీసాడు. ఆ పెయింటింగ్ అమితాబ్‌కి ఎంతగానో నచ్చేసింది. దీంతో ఆయన ఆ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆర్టిస్ట్ పేరు ఆయుష్ అని,ఆయుష్ ప్రత్యేక సామర్థ్యం ఉన్నవాడని, తన చేతులను ఉపయోగించలేడు కానీ కాళ్ళతోనే అద్భుతమైన పెయింటింగ్ వేయగలడు అని పేర్కొన్నారు. తన బొమ్మని అద్భుతంగా గీసినందుకు యువ కళకారుడికి కృతజ్ఞతలు తెలాయజేశాడు అమితాబ్.
Read more : ‘Big B, show your Big heart’ : ‘అమితాబ్ జీ మీ విశాల హృదయాన్ని చాటండి’ అంటూ MNS నిరసన
కాగా..అబితాబ్ కు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగాను అభిమానులున్నాయి. ఈ వయస్సులో కూడా ఆయన చలాకీగా సినిమాలు చేస్తు యువ హీరోలకు సవాల్ విసురుతున్నారు. సినిమాలతో పాటు ఆయన చేసే షోలతో ఎంతగానో అలరిస్తున్నారు. కౌన్ బనేగా కరోడ్ పతి షోలో తనదైన శైలిలో షోలలో చక్కటి మాటలతో ఆకట్టుకోవటం ఆయన స్టైల్.
అమితాబ్‌ని ప్రాణంగా ప్రేమించే అభిమానులు ఎంతో ఉండగా, వారు ఒక్కో రూపంలో తమ ప్రేమని వ్యక్తపరుస్తుంటారు. తాజాగా యువ అభిమాని తన కళతో అమితాబ్ మనస్సు గెలుచుకున్నాడు. కౌన్ బనేగా కరోడ్ పతి షోతో పాటు పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.
