Amul Uses Rrr For Promotions
RRR: ఏదైనా కంపెనీ తమ ప్రాడక్ట్‌లను జనంలోకి తీసుకెళ్లేందుకు విభిన్నమైన ఆలోచనలతో కొత్త ప్రమోషన్స్ చేస్తూ దూసుకెళ్తుంటాయి. కంపెనీలు చేసే యాడ్‌లు జనాలకు కొన్ని నచ్చుతాయి, మరికొన్ని నచ్చవు. అయితే ఈమధ్య కాలంలో ఏ కంపెనీ చూసినా తమ ప్రాడక్టులను సినిమాల్లో ప్రమోట్ చేస్తూ తమ బిజినెస్‌ను పెంచుకుంటున్నాయి. అయితే భారత్‌కు చెందిన అమూల్ మాత్రం అన్నింటికి భిన్నంగా ప్రమోషన్స్‌లో దూసుకుపోతుంది. ఇటీవల ఇండియన్ వైడ్‌గా ఏ టాపిక్ అయితే వైరల్‌గా మారుతుందో, దాన్ని కార్టూన్ రూపంలో తమ ప్రాడక్ట్ ప్రమోషన్ కోసం వాడుకుంటోంది.
RRR: ఓటీటీలో ట్రిపుల్‌ఆర్.. ఎప్పుడు.. ఎక్కడంటే?
రీసెంట్‌గా పుష్ప చిత్రం దేశవ్యాప్తంగా క్రేజ్‌ను దక్కించుకోవడంతో, ఆ సినిమాకు సంబంధించిన కార్టూన్‌తో అమూల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అమూల్ వాడకం ఈ రేంజ్‌లో ఉంటుందా అని నెటిజన్లు అనుకునేలా చేసింది ఈ కంపెనీ కార్టూన్ యాడ్. అయితే తాజాగా అమూల్ ఆర్ఆర్ఆర్‌ను కూడా వదల్లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ‘నాటు నాటు..’ పాటలోని బొమ్మలను కార్టూన్ చేసి అమూల్ తన బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకుంది. ‘TeRRRific Butter’ అనే క్యాప్షన్‌తో అమూల్ చేసిన ఈ కార్టూన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
RRR : తెలుగు సినిమాపై మరోసారి విషం కక్కిన బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఖాన్
ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఈ రేంజ్‌లో తమ ప్రాడక్ట్ కోసం వాడిన వారు లేరని.. అమూల్ మాత్రం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తనకు కావాల్సినట్లుగా మార్చుకుని ప్రమోట్ చేసుకోవడం నిజంగే విశేషమని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మున్ముందు ఇంకెన్ని కంపెనీలు తమ ప్రాడక్టులను ప్రమోట్ చేసుకునేందుకు ఈ సినిమాను వాడుకుంటాయో చూడాలి అంటున్నారు.