RRR : తెలుగు సినిమాపై మరోసారి విషం కక్కిన బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఖాన్

ఇలాంటి సమయంలో కొంతమంది పని కట్టుకొని 'ఆర్ఆర్ఆర్' సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఎదుగుదలకి తట్టుకోలేకపోతున్న బాలీవుడ్ ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం.........

RRR : తెలుగు సినిమాపై మరోసారి విషం కక్కిన బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఖాన్

Rrr Critic

 

RRR :  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని తెరకెక్కించారు. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే సినిమా రిలీజ్ అయి సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకుంది. అమలాపురం నుంచి అమెరికా వరకు ప్రపంచ వ్యాప్తంగా సినిమా చూసిన వారంతా సినిమాపై, రాజమౌళి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు, సెలబ్రిటీలు ‘ఆర్ఆర్ఆర్’ అద్భుతం అంటూ, రాజమౌళి టేకింగ్ అదిరిపోయింది అంటూ రివ్యూలు ఇస్తున్నారు.

అయితే ఇలాంటి సమయంలో కొంతమంది పని కట్టుకొని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఎదుగుదలకి తట్టుకోలేకపోతున్న బాలీవుడ్ ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తుంది. ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమాకి కూడా కొంతమంది బాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ నెగిటివ్ ప్రచారం కావాలని చేశారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి బాలీవుడ్ యాక్టర్, ఫిలిం క్రిటిక్ కమల్ ఖాన్ నెగిటివ్ గా రివ్యూలు ఇస్తూ, సినిమాపై చెడుగా ప్రచారం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నాడు.

కమల్ ఖాన్ అనే క్రిటిక్ గతంలో కూడా దేశం మొత్తం మెచ్చిన ‘బాహుబలి’ సినిమాపై నెగిటివ్ గానే రివ్యూ ఇచ్చాడు. ఆ సినిమాపై కూడా విమర్శలు గుప్పించాడు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై విషం కక్కుతున్నాడు కమల్ ఖాన్. ఇవాళ ఉదయం ముంబైలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసిన కమల్ ఖాన్ వరుస ట్వీట్స్ చేస్తున్నాడు. మొదట ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడటానికి సిద్ధం అని తన ఫోటో పోస్ట్ చేశాడు.

RRR : రామ్‌చరణ్ ఇంట్లో సక్సెస్ సెలబ్రేషన్స్.. భారీ ఎత్తున తరలి రానున్న అభిమానులు

ఇక సినిమా అయిపోయాక తన ట్వీట్స్ లో.. ”ఆర్ఆర్ఆర్ సినిమా తలా తోక లేని ఒక సౌత్ మషాలా సినిమా. ఈ సినిమాతో మమ్మల్ని వెధవల్ని చేశారు. ఇది మరీ ఎక్కువగా ఉంది. కొంచెం అయినా లిమిట్ ఉండాలి. ఈ రోజు నా నాలెడ్జ్ మొత్తం జీరో అయ్యింది. ఇటువంటి సినిమా ఎలా తీస్తారు సార్” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఆర్జీవీ బాలీవుడ్ లో ‘షోలే’ సినిమాని రీమేక్ అంటూ ‘ఆగ్’ తీసి అట్టర్ ప్లాప్ సినిమా ఇచ్చాడు. ఈ సినిమాతో ‘ఆర్ఆర్ఆర్’ని పోలుస్తూ.. ”ప్రతి డైరెక్టర్ కి ఒక ‘ఆగ్’ లాంటి సినిమా ఉంటుంది. మీకు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆగ్ లాంటిదే” అని ట్వీట్ చేశాడు.

”ఆర్ఆర్ఆర్ అనేది వరస్ట్ సినిమా. ఇలాంటి సినిమా ఇండియా సినీ చరిత్రలోనే చూడలేదు. ఈ సినిమా చూస్తే బతికున్న మనిషిని చచ్చేలా చేస్తుంది. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ అనే ప్లాప్ సినిమా దీని కంటే బెటర్. నేనైతే దీనికి సున్నా రేటింగ్ ఇస్తాను” అంటూ దారుణంగా విమర్శలు చేశాడు. ”ఈ సినిమా తీయడాన్ని తప్పుగా అనను. ఇది పెద్ద నేరం. 600 కోట్లతో ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు రాజమౌళిని ఆరు నెలలు జైలులో పెట్టాలి.” అంటూ ట్వీట్ చేసి తను ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ఇచ్చిన రివ్యూ యూట్యూబ్ లింక్ ని కూడా షేర్ చేశాడు.

RRR : భ్రమరాంబ థియేటర్లో మెగా ఫ్యామిలీతో కలిసి బెనిఫిట్ షో చూసిన రాజమౌళి, చెర్రీ

గత కొద్ది కాలంగా టాలీవుడ్ సినిమా రోజు రోజుకి తన ఇమేజ్ ని పెంచుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే బాలీవుడ్ ని కూడా దాటేసి సరికొత్త రికార్డులని సృష్టిస్తుంది. దీంతో బాలీవుడ్ లో కొంతమంది ఇలా తెలుగు సినిమాపై విమర్శలు చేస్తున్నారు. దేశమంతా మెచ్చుకునే సినిమాపై ఇంతలా దారుణంగా విమర్శలు చేస్తూ విషం కక్కడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కమల్ ఖాన్ ట్వీట్స్ చూసిన అభిమానులు, సినీ ప్రేమికులు వీటికి ఘాటుగా రిప్లైలు ఇస్తున్నారు. కమల్ ఖాన్ ని తప్పుపడుతూ రిప్లై ట్వీట్స్ ఇస్తున్నారు. ఎంతమంది ఇలాంటి నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా, సినిమాపై చెడు ప్రచారం చేసినా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయం సాధించిందని, కలెక్షన్లని కూడా కొల్లగొడుతుందని, మరోసారి తెలుగు సినిమా సత్తా చాటుతుందని, రాజమౌళి మరోసారి ఇండియా గర్వపడే సినిమా తీశాడని అభిమానులు, తెలుగు ప్రేక్షకులు అంటున్నారు.