An old man looks like Dhoni : ధోనీ ఏంటి ఇలా అయిపోయాడు?
చాలామంది మనిషిని పోలిన మనుష్యుల్ని చూస్తుంటాం. అయితే 2040 నాటికి ధోనీ రూపం ఎలా ఉండొచ్చు? రీసెంట్‌గా ఐపీఎల్ మ్యాచ్‌లో కనిపించిన ఓ వృద్ధుడిని చూస్తే ధోనీ అలాగే ఉంటాడని కన్ఫామ్ చేసుకోవచ్చు.
- Lakshmi 10tv
- Published On : May 10, 2023 / 10:43 AM IST
An old man looks like Dhoni
An old man looks like Dhoni : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు.. అని అంటారు. కొందరి విషయంలో అది నిజమే అనిపిస్తుంది. రీసెంట్‌గా ఐపీఎల్ మ్యాచ్‌లో అచ్చంగా ఎంఎస్. ధోనిని పోలిన ఓ వృద్ధుడి వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా ఫ్యూచర్ ధోనీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధోనీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మ్యాచ్‌లను వీక్షించేందుకు అనేకమంది అభిమానులు తరలివస్తున్నారు. ఇక స్టేడియం నుండి అనేక అంశాలు వైరల్ అవుతున్నాయి. అయితే రీసెంట్‌గా చెన్నై సూపర్ కింగ్స్, పంజాయ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సమయంలో ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. అచ్చంగా ధోనిని పోలిన వృద్ధుడు తెరపై కనిపించాడు. ఈ క్లిప్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
IPL 2023: అందుకే ప్రేక్షకులంతా కేకేఆర్ జెర్సీతో కాకుండా సీఎస్కే జెర్సీతో నా కోసం వచ్చారు: ధోనీ
ఇన్‌స్టాగ్రామ్‌లో issa_vibe_dump అనే యూజర్ ద్వారా పోస్ట్ అయిన ఈ వీడియో 10 మిలియన్ వ్యూస్ దాటింది. “ధోనీ భవిష్యత్ నుంచి టైమ్ ట్రావెల్ చేస్తున్నాడని, ఇది నిజమేనా? లేక ఏదైనా కెమెరా ట్రిక్ ఉందా?” అని కొందరు అభిప్రాయపడ్డారు. వీడియోలో ధోనీకి ముందువరుసలో కూర్చున్న మహిళను దీపికా పదుకోనేలా ఉంది అని తెగ చర్చించుకుంటున్నారు. ఇక ఈ వీడియోని ధోని కూడా చూసే ఉంటాడు. తన ఫ్యూచర్ ఫీచర్ చూసుకుని ధోనీ ఎలా ఫీల్ అయ్యాడో మరి?
