Anand Mahindra
Anand Mahindra : పుట్టిన దగ్గర్నుంచి వృద్ధాప్యం వరకూ మనిషి ఎదిగే క్రమంలో శారీరకంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. 5 ఏళ్ల నుండి 95 ఏళ్ల వృద్ధురాలిగా రూపాంతరం చెందే క్రమంలో ఓ స్త్రీ రూపంలో సంతరించుకునే మార్పులు ఎలా ఉంటాయో తెలిపే వీడియో ఇంటర్నెట్ ను ఆకర్షిస్తోంది. AI ద్వారా రూపొందించబడిన ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు.
Anand Mahindra : నిమిషాల్లో వేలాది వేడి వేడి ఇడ్లీలు రెడీ .. వావ్ అంటున్న ఆనంద్ మహీంద్రా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడిన ఓ వీడియో ఇప్పుడు అందర్నీ మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. 5 సంవత్సరాల వయస్సు నుంచి 95 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఓ స్త్రీ రూపం ఎలా ఉంటుందో తెలుపుతూ ఓ అందమైన వీడియో క్రియేట్ చేశారు. AI రూపొందించిన వీడియో వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాని ఆకర్షించింది. ‘AI అద్భుతమైన వీడియోని సృష్టించింది. AI శక్తికి నేను భయపడను. నిజంగానే అది చాలా అందమైన మనుష్యుల్ని సృష్టించగలిగితే’ అంటూ ఆయన ఈ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ‘హాంటింగ్లీ బ్యూటిఫుల్’ అని కూడా యాడ్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
AI క్రియేషన్ అద్భుతమని వయసు పెరిగినా కళ్లలో ఏ మార్పు రాలేదని.. జీవితం మొత్తం ఒకటే ఫ్రేమ్ లో కనిపిస్తోందని రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఈ వీడియో ఇంటర్నెట్ లో దూసుకుపోతోంది.
Received this post of a sequence of portraits generated by Artificial Intelligence showing a girl ageing from 5years to 95 years. I won’t fear the power of AI so much if it can create something so hauntingly beautiful….and Human… pic.twitter.com/k7d2qupJ52
— anand mahindra (@anandmahindra) April 24, 2023