Andhra Pradesh: నేడు వర్షం అడ్డు రాకపోతే గుడివాడ గడగడలాడేది: కొల్లు రవీంద్ర
వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలపై 10 టీవీతో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఐదోసారి కూడా గెలుస్తానని కొడాలి నాని అంటున్నారని, ఆయనకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు.
- T Venkateshwarlu
- Published On : June 28, 2022 / 04:00 PM IST
Kollu Ravindra
Andhra Pradesh: వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలపై 10 టీవీతో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఐదోసారి కూడా గెలుస్తానని కొడాలి నాని అంటున్నారని, ఆయనకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. ఈ సారి గుడివాడలో టీడీపీ అత్యధిక ఓట్లతో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లారీ క్లీనర్‌గా ఉన్న కొడాలి నాని మంత్రి అయ్యారంటే అది టీడీపీ బిక్షేనని ఆయన చెప్పారు.
Maharashtra: ఢిల్లీకి చేరిన మహారాష్ట్ర రాజకీయాలు.. 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న ఏక్‌నాథ్
బహిరంగ సభకు వర్షం అడ్డు రాకపోతే ఇవాళ గుడివాడ గడగడలాడేదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తి పుట్టిన ప్రాంత పరువును కొడాలి నాని తీశాడని కొల్లు రవీంద్ర అన్నారు. ఈ ప్రాంతంలో కాసినోలు నిర్వహిస్తూ అర్ధ నగ్న నృత్యాలు చేయించిన ఘనత కొడాలిదేనని ఆయన విమర్శించారు. త్వరలోనే గుడివాడ ప్రజలు కొడాలి నానిని తరిమి కొడతారని ఆయన అన్నారు.
