Maharashtra: ఢిల్లీకి చేరిన మహారాష్ట్ర రాజకీయాలు.. 50 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌న్న ఏక్‌నాథ్‌

మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు కాక రేపుతున్నాయి. అసోంలోని గువాహ‌టిలో ఓ హోట‌ల్‌లో శివ‌సేన రెబ‌ల్ నేత‌ ఏక్‌నాథ్ షిండే దాదాపు 40 మంది ఎమ్మెల్యేల‌తో క్యాంపు ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

Maharashtra: ఢిల్లీకి చేరిన మహారాష్ట్ర రాజకీయాలు.. 50 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌న్న ఏక్‌నాథ్‌

Maharastra

Maharashtra: మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు కాక రేపుతున్నాయి. అసోంలోని గువాహ‌టిలో ఓ హోట‌ల్‌లో శివ‌సేన రెబ‌ల్ నేత‌ ఏక్‌నాథ్ షిండే దాదాపు 40 మంది ఎమ్మెల్యేల‌తో క్యాంపు ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మ‌రిన్ని విష‌యాలు తెలిపారు. త‌న‌కు ఇప్పుడు 50 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంద‌ని అన్నారు. హోట‌ల్‌లోని ఎమ్మెల్యేల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామంటూ శివ‌సేన నేత ఆదిత్య ఠాక్రే అంటున్నార‌ని, ద‌మ్ముంటే ఆయా ఎమ్మెల్యేల పేర్ల‌ను వెల్ల‌డించాల‌ని ఏక్‌నాథ్ షిండే స‌వాలు విసిరారు.

Maharashtra Crisis: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులు

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ప‌త‌నం అంచున ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ అక్క‌డి రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీకి చేరాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత‌ దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి చేరుకున్నారు. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ఏర్పాటు అంశాలపై అధిష్ఠానానికి ఫడ్నవీస్ వివ‌రాలు తెల‌ప‌నున్నారు. ఢిల్లీలో అమిత్ షా, జేడీ నడ్డాను ఆయ‌న‌ కలవనున్నారు.

Maharashtra: ముంబైకి వెళ్తాం.. మా యాక్షన్ ప్లాన్ చెబుతాం: ఏక్‌నాథ్ షిండే

సుప్రీంకోర్టులో రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట ద‌క్కిన‌ తరువాత ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ కార్యాచరణ వేగవంతం చేసింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ వ్యూహాలు ర‌చిస్తోంది. కాసేప‌ట్లో ఏక్‌నాథ్ షిండే ముంబైకి వెళ్ళి మ‌హారాష్ట్ర ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిన కారణంగా బలపరీక్షకు పిలవాలని గవర్నర్ కోష్యారీకి లేఖను అందజేయనున్నారు.