Maharashtra Crisis: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులు

మహారాష్ట్రలో తిరుగుబాటు ఎమ్మెల్యేల అంశాన్ని బీజేపీ ఉపయోగించుకోబోతుంది. రాష్ట్రంలో షిండే ఆధ్వర్యంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణను బీజేపీ వేగవంతం చేసింది.

Maharashtra Crisis: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులు

Maharashtra Crisis

Updated On : June 28, 2022 / 1:21 PM IST

Maharashtra Crisis: మహారాష్ట్రలో తిరుగుబాటు ఎమ్మెల్యేల అంశాన్ని బీజేపీ ఉపయోగించుకోబోతుంది. రాష్ట్రంలో షిండే ఆధ్వర్యంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణను బీజేపీ వేగవంతం చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ అంశంపై బీజేపీ పెద్దలతో చర్చించేందుకు ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

Kodali Nani: ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదు: కొడాలి నాని

అక్కడ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అవకాశాల గురించి అధిష్టానానికి వివరిస్తారు. ఈ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దాను ఫడ్నవీస్ కలుస్తారు. ఈ భేటీకి గువహటిలో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే కూడా ఢిల్లీ వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ ప్రణాళిక రచించినట్లు సమాచారం. మహా వికాస్ అఘాడి (ఎమ్‌వీఏ) ప్రభుత్వాన్ని శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిపి కూల్చాలని బీజేపీ వ్యూహం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా షిండే ముంబై వెళ్లి, గవర్నర్‌ను కలుస్తారు. ఇప్పటికే షిండే ముంబై బయలుదేరినట్లు సమాచారం.

P.V.Narasimha Rao: ఆర్థిక సంస్కరణల పితామహుడు.. జాతి మరువని నేత ‘పీవీ’

అక్కడ ఎమ్‌వీఏ బలపరీక్ష నిరూపించుకునేలా అవిశ్వాస తీర్మానం నిర్వహించేలా చూడమని షిండే గవర్నర్‌ను కోరుతారు. అధికారంలో ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ సహా ప్రతిపక్షాలు, శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బల పరీక్షకు వ్యతిరేకంగా నిలుస్తారు. అయితే, అవిశ్వాస తీర్మానంపై ఉద్ధవ్ థాక్రే న్యాయ నిపుణులను సంప్రదించే అవకాశం ఉంది.