Kodali Nani: ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదు: కొడాలి నాని

ఎన్టీఆర్ ఫొటో రంగులకు.. టీడీపీకి సంబంధం ఏంటి? ఆనాడు ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది. ఈ అంశంపై బహిరంగ చర్చకు కూడా సిద్ధం. బొమ్మలూరులో నా సొంత డబ్బుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నేనే ఏర్పాటు చేశా.

Kodali Nani: ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదు: కొడాలి నాని

Kodali Nani

Kodali Nani: ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదని, ఆయన జాతి సంపద అని, ఎన్టీఆర్ ఫొటోను ఎవరైనా వాడుకోవచ్చని అన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. 10టీవీతో మంగళవారం కొడాలి నాని ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ, చంద్రబాబుపై విమర్శలు చేశారు. ‘‘ఎన్టీఆర్ జాతి సంపద. ఆయన ఫొటోను ఎవరైనా వాడుకోవచ్చు.

P.V.Narasimha Rao: ఆర్థిక సంస్కరణల పితామహుడు.. జాతి మరువని నేత ‘పీవీ’

ఎన్టీఆర్ ఫొటో రంగులకు.. టీడీపీకి సంబంధం ఏంటి? ఆనాడు ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది. ఈ అంశంపై బహిరంగ చర్చకు కూడా సిద్ధం. బొమ్మలూరులో నా సొంత డబ్బుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నేనే ఏర్పాటు చేశా. నా శిలా ఫలకాన్ని తొలగించడంతోనే వివాదం మొదలైంది. గుడివాడ నియోజకవర్గం మొత్తం ఎన్టీఆర్, వైఎస్సార్ విగ్రహాలను ఏర్పాటు చేసి వైసీపీ రంగులు వేయిస్తా. ఎవరేం చేస్తారో చూస్తా. సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీని గెలిపించలేని చంద్రబాబు.. గుడివాడలో ఏం గెలిపిస్తారు? టీడీపీ అధికారంలో ఉండగా నా పార్టీ ఆఫీస్ ఖాళీ చేయించి, నా మీద 60 కేసులు పెట్టించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ఆశీస్సులతో ఐదవసారి కూడా గెలవబోతున్నాను. నా ప్రత్యర్థి చంద్రబాబు అయితే బాగుంటుంది. ఒకసారి కాటా దెబ్బ ఏంటో చూపిస్తా.

P.V.Narasimha Rao: ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మాణం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

టీడీపీ నేతలు బహిరంగ సభ అంటూ నాలుగు జిల్లాల్లో జన సమీకరణ చేస్తూ, విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంటే నాకు గౌరవం. చంద్రబాబు, లోకేష్‌ను తప్పించి, ఇప్పటివరకు ఎవరినీ ఒక్క మాట అనలేదు. భువనేశ్వరిపై నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా అసత్య ప్రచారం చేస్తున్నారు. మంత్రి పదవి లేకపోవడం వల్ల నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. మంత్రులుగా ఉన్నవాళ్లు ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు సమాధానం చెబుతారు. ఎవరైనా పార్టీపై విమర్శలు చేస్తే నేను చూస్తూ ఊరుకోను’’ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.