P.V.Narasimha Rao: ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మాణం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలుగు వారు గర్వపడే వ్యక్తి పీవీ. ఆయనకు భారత ప్రభుత్వం, ప్రధాని తరఫున నివాళులు. ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మిస్తున్నాం. ఢిల్లీలో పీఎం మ్యూజియంలో పీవీ గుర్తుగా పలు జ్ఞాపకాలను ఏర్పాటు చేశాం. పీవీ నరసింహా రావు చరిత్ర అందరికీ తెలిసేలా పుస్తకాలు విడుదల చేస్తున్నాం.

P.V.Narasimha Rao: ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మాణం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

P.v.narasimha Rao

P.V.Narasimha Rao: పీవీ గొప్పతనం భావి తరాలకు తెలిసేలా ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్, నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

Aaditya Thackeray: షిండే క్యాంపు నుంచి 20 మంది ఎమ్మెల్యేలు తిరిగొస్తారు: ఆదిత్య ఠాక్రే

‘‘తెలుగు వారు గర్వపడే వ్యక్తి పీవీ. ఆయనకు భారత ప్రభుత్వం, ప్రధాని తరఫున నివాళులు. ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మిస్తున్నాం. ఢిల్లీలో పీఎం మ్యూజియంలో పీవీ గుర్తుగా పలు జ్ఞాపకాలను ఏర్పాటు చేశాం. పీవీ నరసింహా రావు చరిత్ర అందరికీ తెలిసేలా పుస్తకాలు విడుదల చేస్తున్నాం. ఆయన గొప్పదనం అందరికీ తెలిసేలా తపాలా బిళ్ల విడుదలకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పీవీ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్రం పీవీని విస్మరించడం బాధాకరమన్నారు.

Nizamabad: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. కోమా పేషెంట్ నగలు మాయం

‘‘తెలంగాణ ముద్దు బిడ్డ, భారత దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పీవీ. అంచెలంచెలుగా ప్రధాని స్థాయికి ఎదిగారు. దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్లే దేశం ఇప్పుడు ఇలా నడుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పీవీని తలచుకోవడం లేదు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ ఉన్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదు. పీవీ గొప్పదనం తెలిసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని కేంద్రాన్ని కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది శత జయంతి వేడుకలు జరిపింది. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లే ప్రస్తుతం ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. పీవీని గౌరవించుకోవాలి. ఎవరి గౌరవం వారికి ఇవ్వాలి. పీవీ ఘాట్ వచ్చి, ఆయనకు నివాళులు అర్పించాలని ప్రధానిని కోరుతున్నా’’ అని తలసాని వ్యాఖ్యానించారు.

Siddipet: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో విద్యార్థులు

పీవీకి నివాళులు అర్పించిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు కూడా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక విప్లవం తీసుకొచ్చిన నేత పీవీ అని, ఆయనకు సోనియా గాంధీ తగిన గుర్తింపు ఇచ్చారన్నారు. పీవీ ఎంపీ కాకపోయినా, సోనియా గాంధీ ఆయనను ప్రధానిని చేశారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.