Nizamabad: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. కోమా పేషెంట్ నగలు మాయం

లక్ష్మీని ఆసుపత్రిలో చేర్పించిన రోజు ఆమె ఒంటి నిండా బంగారం ఉండగా, తీరా డిశ్చార్జ్ సమయానికి నగలు కనిపించకుండా పోయాయి. దీంతో షాక్ అయిన ఆమె కుటుంబ సభ్యులు నగల దోపిడీ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు.

Nizamabad: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. కోమా పేషెంట్ నగలు మాయం

Nizamabad

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం బయటపడింది. కోమాలో ఉన్న పేషెంటు నగలు హాస్పిటల్ సిబ్బందే కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ నగరంలోని మనోరమ అనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో లక్ష్మీ అనే వృద్ధురాలు చేరింది. షుగర్ లెవల్స్ పెరగడంతో లక్మీ కోమాలోకి వెళ్లింది.

Gmail offline: ఇంటర్నెట్ లేకున్నా జీమెయిల్.. ఎలా వాడొచ్చంటే

అయితే, లక్ష్మీని ఆసుపత్రిలో చేర్పించిన రోజు ఆమె ఒంటి నిండా బంగారం ఉండగా, తీరా డిశ్చార్జ్ సమయానికి నగలు కనిపించకుండా పోయాయి. దీంతో షాక్ అయిన ఆమె కుటుంబ సభ్యులు నగల దోపిడీ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉన్నతాధికారుల జోక్యంతో స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం సీసీ టీవీ కెమెరాలు పరిశీలించింది. నగలు మాయం కావడానికి తమ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని గుర్తించింది. రెండు వారాల్లో నగలు రికవరీ చేస్తామని హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి ఒప్పంద పత్రం కూడా రాసిచ్చింది. అయితే, రోజులు గడిచాక తమకు నగలతో ఎలాంటి సంబంధం లేదంటూ ప్లేట్ ఫిరాయించింది.

Siddipet: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో విద్యార్థులు

దీంతో పేషెంట్ కుటుంబ సభ్యులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌తోపాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పేషెంట్ చికిత్సకు నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసిన ఆసుపత్రి యాజమాన్యం, మరోవైపు పేషెంట్ నగలు కాపాడటంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల వైఖరి మరోసారి చర్చకొచ్చింది.