Gmail offline: ఇంటర్నెట్ లేకున్నా జీమెయిల్.. ఎలా వాడొచ్చంటే

ఈ ఫీచర్ వాడుకోవాలంటే ముందుగా క్రోమ్ బ్రౌజర్‌లో ఇంటర్నెట్ ఉన్నప్పుడే మెయిల్.గూగుల్.కామ్ (mail.google.com)ను బుక్ మార్క్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత జీ మెయిల్ యాప్ ఓపెన్ చేసి, అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్తే ‘సీ ఆల్ సెట్టింగ్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

Gmail offline: ఇంటర్నెట్ లేకున్నా జీమెయిల్.. ఎలా వాడొచ్చంటే

Gmail Offline

Gmail offline: ఇంటర్నెట్ లేకుండానే ఆఫ్‌లైన్ మోడ్‌లో జీమెయిల్ వాడగలిగే ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇంటర్నెట్ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆఫ్‌లైన్‌లోనే మెయిల్స్ రిసీవ్ చేసుకోవడం, రిప్లై ఇవ్వడం వంటివి చేయొచ్చు. ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా లేని ప్రాంతాల్లో, మొబైల్‌లో నెట్ బ్యాలెన్స్ అయిపోయిన సమయంలో ఈ సేవలు వినియోగించుకోవచ్చు.

Rythu Bandhu: నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు.. తొలిరోజు ఎవరికంటే..

ఇంతకీ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? దీన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. ఈ ఫీచర్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో మాత్రమే పనిచేస్తుంది. అలాగే ఇన్‌కాగ్నిటో మోడ్‌లో పనిచేయదు. ఈ ఫీచర్ వాడుకోవాలంటే ముందుగా క్రోమ్ బ్రౌజర్‌లో ఇంటర్నెట్ ఉన్నప్పుడే మెయిల్.గూగుల్.కామ్ (mail.google.com)ను బుక్ మార్క్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత జీ మెయిల్ యాప్ ఓపెన్ చేసి, అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్తే ‘సీ ఆల్ సెట్టింగ్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఆఫ్‌లైన్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేస్తే, ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల క్రితం నాటి ఈ-మెయిల్స్ ఆఫ్‌లైన్‌లో స్టోర్ చేయాలి అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో వారం, నెల, మూడు నెలలు అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మీరు ఎన్ని రోజుల నాటి మెయిల్స్ కావాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవాలి.

TS Inter Result: నేడు ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

తర్వాత సేవ్ ఛేంజెస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే చాలు. ఆఫ్‌లైన్‌ జీమెయిల్ సేవలు వినియోగించుకోవచ్చు. అయితే, కొందరి ఖాతాల్లో ఎనేబుల్ ఆఫ్‌లైన్‌ మెయిల్ అనే ఆప్షన్ కనిపించదు. ఎండ్ స్పేస్ అనే మెసేజ్ కనిపిస్తుంది. గూగుల్ అకౌంటులో స్టోరేజ్ కెపాసిటీ ఫుల్ అయిపోతే, అలా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు గూగుల్ అకౌంటు నుంచి అనవసరమైన డేటా ఫైల్స్ డిలీట్ చేయాలి. ఎందుకంటే ఆఫ్‌లైన్‌లో మెయిల్స్ స్టోర్ చేయాలంటే, ఇంకొంత డాటా స్పేస్ అవసరమవుతుంది.