Rythu Bandhu: నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు.. తొలిరోజు ఎవరికంటే..

ఖరీఫ్ సీజన్ కు సంబంధించి తొమ్మిదో విడత రైతు బంధు నగదు పంపిణీకి అంతా సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నేటి మధ్యాహ్నం నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమకానున్నాయి. ఈ సీజన్‌కు రైతుబంధుకు అర్హులైన రైతుల సంఖ్య 68.94 లక్షలుగా ప్రభుత్వం లెక్కతేల్చింది.

Rythu Bandhu: నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు.. తొలిరోజు ఎవరికంటే..

Rythui Bandhu

Updated On : June 28, 2022 / 7:19 AM IST

Rythu Bandhu: ఖరీఫ్ సీజన్ కు సంబంధించి తొమ్మిదో విడత రైతు బంధు నగదు పంపిణీకి అంతా సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నేటి మధ్యాహ్నం నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమకానున్నాయి. ఈ సీజన్‌కు రైతుబంధుకు అర్హులైన రైతుల సంఖ్య 68.94 లక్షలుగా ప్రభుత్వం లెక్కతేల్చింది. అయితే తొలిరోజు మంగళవారం ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. రాష్ట్రంలో ఎకరం భూమి కలిగిన రైతులు 19.98 లక్షల మంది ఉన్నారు. వీరికి మంగళవారం రూ.568.65 కోట్లు ఖాతాల్లో జమకానున్నాయి.

Telangana Rythu Bandhu : ఈసారి రూ.7వేల 700కోట్లు.. రైతుబంధుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు

రైతులకు ప్రతీఏడాది ఖరీఫ్, రబీ కాలాల్లో పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ. 10వేలు అందిస్తుంది. ఖరీఫ్ కు ఎకరాకు రూ. 5వేలు, రబీ సీజన్ కు ఎకరాకు రూ. 5వేలు చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 68.94లక్షల మందికి రైతులకు మొత్తం 153.11 లక్షల ఎకరాల భూమికి సంబంధించి రూ. 7,654.43 కోట్లు ప్రభుత్వం అందించనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిరోజు (మంగళవారం) ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ కానున్నాయి. రాష్ట్రంలో ఎకరం పొలం ఉన్న రైతులు 19.98 లక్షల మంది ఉన్నారు. వీరి ఖాతాల్లో రూ.586.65 కోట్లు జమ కానున్నాయి.

TS Inter Result: నేడు ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

ఇదిలాఉంటే గత సీజన్ తో పోల్చితే ఈసారి 3.64 లక్షల మందికి పైగా రైతులకు కొత్తగా రైతుబంధు అందనున్నది. సుమారు 1.5 లక్షల ఎకరాల భూమి కొత్తగా జాబితాలో చేరింది. భూముల క్రయవిక్రయాలు, బదలాయింపు, కోర్టు కేసుల పరిష్కారాలు, వివాదంలోని పార్ట్‌-బీ జాబితాలోని భూ సమస్యల పరిష్కారం వంటి కారణాలతో రైతుల సంఖ్యతో పాటు భూమి కూడా పెరిగింది. గత యాసంగిలో సుమారు 63 లక్షల మంది రైతులకు చెందిన 1.48 కోట్ల ఎకరాలకు రూ.7,411.52 కోట్లు అందింది.