Bitter Experience To Ysrcp Leader Ambati Rambabu From Gadapa Gadapaku Program
Andhra Pradesh: ఏపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గోదావరి వరద అన్ని ప్రాంతాల్ని ముంచెత్తినా భద్రాచలం పట్టణాన్ని మాత్రం ముంచలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను అంబటి ప్రస్తావించారు. రెండు దశాబ్దాల క్రితం టీడీపీ ప్రభుత్వం కట్టిన కరకట్టే భద్రాచలం పట్టణాన్ని కాపాడడానికి కారణమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అంబటి మండిపడ్డారు. ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలో అంబటి మీడియాతో మాట్లాడుతూ… 1983లో భద్రాచలం కట్ట కట్టానని చంద్రబాబు అంటున్నారని, ఆ సమయంలో ఆయన టీడీపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు విషం కక్కుతున్నారని అంబటి మండిపడ్డారు. పరామర్శల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హెలికాప్టర్‌ను వాడలేదా అని అంబటి నిలదీశారు. ఇప్పుడు జగన్ హెలికాప్టర్ వాడితే ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే ముంపు ప్రాంతాలకు సీఎం వెళ్ళలేదని ఆయన చెప్పారు. ఏపీ సర్కారు బాధితులకు అండగా నిలిచిందని అన్నారు. గోదావరి ఉధృతితో భారీ నష్టం జరిగిందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Kerala: యూట్యూబ్‌లో చూసి మద్యం తయారు చేసిన బాలుడు.. తాగి ఆసుపత్రిలో చేరిన అతడి స్నేహితుడు