Kerala: యూట్యూబ్‌లో చూసి మ‌ద్యం త‌యారు చేసిన బాలుడు.. తాగి ఆసుప‌త్రిలో చేరిన అత‌డి స్నేహితుడు

యూట్యూబ్‌లో చూసి మ‌ద్యం ఎలా త‌యారు చేయాలో నేర్చుకున్నాడు పన్నెండేళ్ళ ఓ బాలుడు. గ్రేప్ వైన్ తయారు చేసి తన స్నేహితుడికి ఇచ్చాడు. దీంతో ఈ మ‌ద్యం తాగిన అత‌డి స్నేహితుడు అస్వ‌స్థ‌త‌కు గురై ఆసుప‌త్రిలో చేరాడు. ఈ ఘ‌ట‌న‌ కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో చోటు చేసుకుంది.

Kerala: యూట్యూబ్‌లో చూసి మ‌ద్యం త‌యారు చేసిన బాలుడు.. తాగి ఆసుప‌త్రిలో చేరిన అత‌డి స్నేహితుడు

Wine

Kerala: యూట్యూబ్‌లో చూసి మ‌ద్యం ఎలా త‌యారు చేయాలో నేర్చుకున్నాడు పన్నెండేళ్ళ ఓ బాలుడు. గ్రేప్ వైన్ తయారు చేసి తన స్నేహితుడికి ఇచ్చాడు. దీంతో ఈ మ‌ద్యం తాగిన అత‌డి స్నేహితుడు అస్వ‌స్థ‌త‌కు గురై ఆసుప‌త్రిలో చేరాడు. ఈ ఘ‌ట‌న‌ కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మీడియాకు వివ‌రాలు తెలిపారు. మ‌ద్యాన్ని త‌యారు చేసిన బాలుడిని తాము విచారించామ‌ని చెప్పారు.

త‌న తల్లిదండ్రులు తీసుకొచ్చిన దాక్ష‌తో తాను యూట్యూబ్‌లో చూసి వైన్ త‌యారు చేశాన‌ని ఆ బాలుడు త‌మ‌ని తెలిపాడని అన్నారు. మ‌ద్యాన్ని త‌యారు చేశాక దాన్ని ఓ బాటిల్‌లో పోసి, భూమిలో పాతిపెట్టాన‌ని ఆ బాలుడు చెప్పాడ‌ని పోలీసులు తెలిపారు. ఇలాగే చేయాల‌ని యూట్యూల్‌లో చూసి నేర్చుకున్నాన‌ని ఆ బాలుడు వివ‌రించాడ‌ని అన్నారు.

ఆ త‌ర్వాత దాన్ని ఆ బాలుడు స్నేహితుడికి ఇచ్చాడు. దాన్ని తాగిన అత‌డి స్నేహితుడు వాంతులు చేసుకుని, అనారోగ్యానికి గుర‌య్యాడు. న్యాయ‌స్థానం అనుమ‌తితో పోలీసులు ఆ మ‌ద్యం శాంపిళ్ళ‌ను బాటిల్ నుంచి తీసుకుని ప‌రీక్ష‌కు పంపారు. దీనిపై పోలీసులు త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.

viral pic: ‘వ్యంగ్యం అంటే ఇదే’.. విప‌రీతంగా వైర‌ల్ అవుతోన్న ఫొటో