Botsa Slams Chandrababu
Andhra Pradesh: పనిచేయకుండా పార్టీలో ఉంటామంటే కుదరదని వైసీపీ నేతలు, కార్యకర్తలను ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పనితోనే ప్రతిపక్ష నాయకులకు సమాధానం ఇవ్వాలని చెప్పారు. పేదవారికి సంక్షేమ పథకాలు అందిస్తుంటే టీడీపీ ఓర్వలేకపోతుందని అన్నారు. పథకాల పేరుతో ప్రభుత్వం ప్రజలకు దోచుపెడుతుందని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు అసమర్థ పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన చెప్పారు.
Maharashtra: ఇదే పని రెండున్నరేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయలేదు?: ఉద్ధవ్ ఠాక్రే
ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారని అన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే హుద్‌హుద్ తుపాను వల్ల ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించారని చెప్పుకొచ్చారు. బైజూస్ యాప్‌తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. బైజూస్ ఉచితంగా తమ సర్వీసులు అందజేస్తోందని చెప్పారు. ఇందులోనూ కుంభకోణం జరిగిందని చంద్రబాబు అంటున్నారని చెప్పారు. ఉచితంగా చేసుకున్న ఎంవోయూలో అవినీతి ఎలా జరుగుతుందని ఆయన నిలదీశారు.