Maharashtra: ఇదే ప‌ని రెండున్న‌రేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయ‌లేదు?: ఉద్ధ‌వ్ ఠాక్రే

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన అనంత‌రం తొలిసారి శివ‌సేన నేత‌ ఉద్ధ‌వ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. 2019 మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు బీజేపీ, శివ‌సేన మిత్ర‌త్వాన్ని కొన‌సాగించిన విష‌యం తెలిసిందే.

Maharashtra: ఇదే ప‌ని రెండున్న‌రేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయ‌లేదు?: ఉద్ధ‌వ్ ఠాక్రే

Uddav

Maharashtra: మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన అనంత‌రం తొలిసారి శివ‌సేన నేత‌ ఉద్ధ‌వ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. 2019 మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు బీజేపీ, శివ‌సేన మిత్ర‌త్వాన్ని కొన‌సాగించిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల్లో ఆ రెండు పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధించాక త‌మ‌కు సీఎం ప‌ద‌వి కావాల‌ని శివ‌సేన డిమాండ్ చేసింది. అయితే, అందుకు బీజేపీ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో క‌లిసి శివ‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Maharashtra: డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఫ‌డ్న‌వీస్‌పై మోదీ ప్ర‌శంస‌ల జ‌ల్లు

ఇప్పుడు మాత్రం సీఎం పదవిని శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేకు అప్ప‌గించింది. దీంతో ఈ ప‌ని రెండున్న‌రేళ్ళ క్రిత‌మే చేసి ఉంటే తాము ఎన్సీపీ-కాంగ్రెస్‌తో మహా వికాస్ అఘాడీని ఏర్పాటు చేయ‌క‌పోయేవాళ్ళం క‌దా? అని ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌శ్నించారు. బీజేపీ రెండు రోజుల క్రితం చేసిన ప‌నే రెండున్న‌రేళ్ళ క్రితం మ‌ర్యాద‌పూర్వ‌కంగా చేసి ఉంటే బాగుండేది క‌దా? అని ఆయ‌న నిల‌దీశారు.

Maharashtra: మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్ర‌మాణం.. డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్

గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత రెండున్న‌రేళ్ళ‌పాటు శివ‌సేన నేత సీఎంగా ఉంటార‌ని బీజేపీ నేత, కేంద్ర‌మంత్రి అమిత్ షాకు అప్ప‌ట్లో చెప్పామ‌ని ఉద్ధ‌వ్ ఠాక్రే గుర్తుచేశారు. అయితే, అందుకు బీజేపీ ఒప్పుకోలేద‌ని అన్నారు. ఇప్పుడు మాత్రం ఏక్‌నాథ్ షిండేకు సీఎం ప‌ద‌వి ఇవ్వ‌డానికి ఒప్పుకుంద‌ని విమ‌ర్శించారు. రెండేళ్ళ క్రితం తాము చెప్పింది బీజేపీ వింటే ఇప్పుడు మ‌హారాష్ట్రకు బీజేపీ నేత ముఖ్య‌మంత్రిగా ఉండేవార‌ని ఉద్ధవ్ అన్నారు.