Earthquake In Delhi: ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం సాయంత్రం ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది.

Earthquake In Delhi: ఢిల్లీలో మరోసారి భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు

Updated On : November 12, 2022 / 9:15 PM IST

Earthquake In Delhi: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భూ ప్రకంపనలతో ఊగిపోయింది. శనివారం సాయంత్రం ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు నోయిడా, ఘజియాబాద్ వంటి పలు ఉత్తరాది ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.

Viral Video: సఫారి వాహనంలోకి ఎగిరి దూకిన సింహం.. సందర్శకులకు సరికొత్త అనుభూతి.. ఇంతకీ సింహం ఏం చేసిందంటే

ఢిల్లీలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూకంప కేంద్రం నేపాల్‌లో, భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 9న కూడా ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు నోయిడా, గుర్గావ్ వంటి ప్రాంతాల్లో 6.3 తీవ్రతతో భూమి కంపించింది. తాజాగా ఈ రోజు మరోసారి భూమి కంపించింది. వరుస భూ ప్రకంపనలతో డిల్లీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.