Anu Emmanuel : అల్లు శిరీష్‌తో డేటింగ్.. ఆ వార్తలు చూసి మా అమ్మ చాలా బాధపడింది..

ల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ డేటింగ్ లో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి. సినిమాలో కూడా వీరిద్దరి మధ్య రొమాన్స్ చాలా ఎక్కువగానే ఉంది. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో అను ఇమ్మాన్యుయేల్ ఈ వార్తలపై స్పందించింది..........

Anu Emmanuel comments on dating with allu sirish

Anu Emmanuel :  అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ఇటీవల నవంబర్ 4న రిలీజయింది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాక అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ డేటింగ్ లో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి. సినిమాలో కూడా వీరిద్దరి మధ్య రొమాన్స్ చాలా ఎక్కువగానే ఉంది.

ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ కూడా నా కొడుకుతో డేటింగ్ లో ఉన్నావా అని అడిగారని అను ఇమ్మాన్యుయేల్ తెలిపింది. ఇప్పటివరకు వీరిద్దరూ దీనిపై మాట్లాడకపోవడంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో అను ఇమ్మాన్యుయేల్ ఈ వార్తలపై స్పందించింది.

Varun Dhawan : అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ యువ హీరో.. బ్యాలెన్స్ తప్పి అకస్మాత్తుగా పడిపోతాడంట..

అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ”అల్లు శిరీష్ తో డేటింగ్ చేస్తున్నా అనే వార్తల్లో నిజం లేదు. నటీనటులపై ఇలాంటి వార్తలు రావడం సహజం. శిరీష్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. నేను ఇలాంటి అబద్దపు వార్తలు పట్టించుకోను. కానీ ఎవరో రాసిన ఇలాంటి వార్తలు చూసి మా అమ్మ చాలా బాధపడింది” అని తెలిపింది.