Varun Dhawan : అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ యువ హీరో.. బ్యాలెన్స్ తప్పి అకస్మాత్తుగా పడిపోతాడంట..

ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ''నేను వెస్టిబ్యులర్‌ హైపోఫంక్షన్‌ అనే వ్యాధితో పోరాడుతున్నాను. ఈ వ్యాధివల్ల సడెన్ గా బ్యాలెన్స్‌ కోల్పోతాను. సడెన్ గా పడిపోబోతాను. ఈ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే వ్యాధి................

Varun Dhawan : అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ యువ హీరో.. బ్యాలెన్స్ తప్పి అకస్మాత్తుగా పడిపోతాడంట..

Varun Dhawan effected with rare disease vestibular hypofunction

Varun Dhawan :  బాలీవుడ్‌ యువ హీరో వరుణ్‌ ధావన్‌ త్వరలో భేదియా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా తోడేలు అనే టైటిల్ తో రిలీజ్ అవుతుంది. నవంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ ఓ షాకింగ్ విషయాన్ని తెలియచేశాడు.

Madhyapradesh : మధ్యప్రదేశ్‌లో సినిమా షూటింగ్ 50 శాతం పైగా చేస్తే నగదు ప్రోత్సాహం.. లొకేషన్ ఛార్జిలో 75 శాతం రిటర్న్..

ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ”నేను వెస్టిబ్యులర్‌ హైపోఫంక్షన్‌ అనే వ్యాధితో పోరాడుతున్నాను. ఈ వ్యాధివల్ల సడెన్ గా బ్యాలెన్స్‌ కోల్పోతాను. సడెన్ గా పడిపోబోతాను. ఈ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే వ్యాధి చెవికి సంబంధించినది. చెవి లోపలి భాగం సరిగా పనిచేయకపోవడంతో చెవికి, మెదడుకి ఉన్న కాంటాక్ట్స్ అపుడప్పుడు సరిగ్గా పనిచేయవు. దీంతో రోజూ ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. తలకి ఒకవైపు, ఒక్కోసారి రెండువైపులా దీని ప్రభావం ఉండి తల తిరిగినట్టు అవుతుంది. ఈ వ్యాధి ఉన్నవాళ్లు ఎక్కువగా సడెన్ గా బ్యాలెన్స్‌ అదుపుతప్పి పడిపోయే అవకాశాలు ఉన్నాయి” అని తెలిపాడు. దీంతో ఈ యువ హీరో ఆ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని అతని ఫ్యాన్స్, నెటిజన్లు కోరుకుంటున్నారు.