Anukoni Athidhi : సాయి పల్లవి పర్ఫార్మెన్స్ పిచ్చ పీక్స్ అసలు..

విభిన్న కథా, కథనాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ.. 1972 కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్ధ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది..

Anukoni Athidhi : సాయి పల్లవి పర్ఫార్మెన్స్ పిచ్చ పీక్స్ అసలు..

Anukoni Athidhi Telugu Movie Teaser

Updated On : May 22, 2021 / 2:26 PM IST

Anukoni Athidhi: వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘అథిరన్’.. ఈ మూవీ మలయాళంలో మంచి విజయం సాధించడంతో పాటు సాయి పల్లవి, ఫాహద్ పర్ఫార్మెన్స్‌కి చక్కటి ప్రశంసలు లభించాయి..

Athiran Malayalam Movie

తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ ఈ సినిమాను తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.. విభిన్న కథా, కథనాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ.. 1972 కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్ధ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.. రీసెంట్‌గా టీజర్ రిలీజ్ చేశారు..

మానసిక సమస్యతో బాధపడే క్యారెక్టర్‌లో సాయి పల్లవి యాక్టింగ్ ఆకట్టుకుంటోంది.. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.. మే 28 నుండి ‘ఆహా’ లో ‘అనుకోని అతిథి’ స్ట్రీమింగ్ కానుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, రెంజి పానికర్, లియోనా లిషోయ్, శాంతికృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్: జిబ్రాన్, మ్యూజిక్: పిఎస్‌ జయహరి.