Lucifer Remake: చిరుకు జోడీగా అనుష్క.. లూసిఫర్ లో హీరోయిన్ నిజమేనా?
మెగాస్టార్ ఇప్పుడు వరస సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరు ఆ తర్వాత మరో రెండు రీమేక్ కథలను సిద్ధం చేసుకున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్‌తో పాటు వేదాళం రీమేక్‌లో మెగాస్టార్ నటించబోతున్నాడు.
- Naresh Mannam
- Published On : May 16, 2021 / 01:18 PM IST
Anushka As Chiru Jodi Is The Heroine In Lucifer
Lucifer Remake: మెగాస్టార్ ఇప్పుడు వరస సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరు ఆ తర్వాత మరో రెండు రీమేక్ కథలను సిద్ధం చేసుకున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్‌తో పాటు వేదాళం రీమేక్‌లో మెగాస్టార్ నటించబోతున్నాడు. ఆచార్య పూర్తికాకముందే లూసిఫర్ రీమేక్ కూడా మొదలుపెట్టాలని మెగా కాంపౌండ్ గట్టిగా ప్రయత్నిస్తుంది. నిజానికి ఏప్రిల్‌లోనే లూసిఫర్ రీమేక్ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నా కొన్ని కారణాలతో వాయిదా పడింది.
ఈ సినిమా కోసం దర్శకుడు మోహన్ రాజా ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తిచేయగా కరోనా లాక్ డౌన్ తో వచ్చిన విరామంతో ఇప్పుడు ఈ కథకు మెరుగులు దిద్దుతున్నారని వినిపిస్తుంది. రచయిత లక్ష్మి భూపాల్ ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తుండగా మోహన్ రాజా మరోవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్లుగా చెప్తున్నారు. కాగా, ఇప్పుడు ఈ క్రేజీ రీమేక్ కు సంబంధించి ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. అదే ఈ సినిమాలో చిరుకు జోడీకి అనుష్క జతకట్టనుందట.
నిజానికి ఈ సినిమా ఒరిజినల్ లో హీరోయిన్ కు అవకాశం లేదు. కానీ, మోహన్ రాజా నేటివిటీకి తగ్గట్లు మార్పులతో పాటు హీరోయిన్ పాత్రను కథలో భాగం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే.. ఆ పాత్ర నిడివి తక్కువే అయినా సినిమాలో కీలకం కావడంతో అందుకు తగ్గ హీరోయిన్ ఎంపికలో ఉన్న టీంకు అనుష్క బెస్ట్ ఛాయిస్ గా మారినట్లు తెలుస్తుంది. మరి నిడివి తక్కువే అయినా పాత్ర ప్రాధ్యాన్యత దృష్ట్యా జేజెమ్మ జై కొడుతుందా లేదా అన్నది ఇప్పుడు మెగా అభిమానులలో సస్పెన్స్ గా మారింది.
Read: Sonusood: 7 మిలియన్లకు చేరుకున్న సోనూసూద్ ట్విట్టర్ కుటుంబం!
