Sonusood: 7 మిలియన్లకు చేరుకున్న సోనూసూద్ ట్విట్టర్ కుటుంబం!

ఒకప్పుడు సోనూసూద్ అంటే క్రూరమైన విలన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే. కానీ గతేడాది కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో ఎందరో దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాడు.

Sonusood: 7 మిలియన్లకు చేరుకున్న సోనూసూద్ ట్విట్టర్ కుటుంబం!

Sonusood Twitter Family Reaches 7 Million

Sonusood Twitter: ఒకప్పుడు సోనూసూద్ అంటే క్రూరమైన విలన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే. కానీ గతేడాది కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో ఎందరో దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాడు. రీల్ లైఫ్ లో విలన్ రిలయ్‌ లైఫ్‌లో మాత్రం హీరోగా మారాడు. పేద ప్రజలకు దేవుడిగా మారిన సోనూసూద్‌కు ఏకంగా గుడినే కట్టించారు ఆయన అభిమానులు.

సోషల్ మీడియా వేదికగా ఎవరు ఏం అడిగినా ఇచ్చి ఆదుకొనే సోనూసూద్ గత ఏడాది నుండి నిర్విరామంగా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. అందుకే యావత్ ఇండియా ఇప్పుడు సోనూ భాయ్ ను రియల్ హీరో అని ముక్త కంఠంతో కీర్తిస్తుంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే సోనూసూద్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఇప్పుడు తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేశాడు. ఇప్పుడు ఏకంగా దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ అందించేందుకు కూడా పూనుకున్నాడు.

ఇంత ఘనంగా సేవాకార్యక్రమాలు చేస్తున్న సోనూసూద్ కు సోషల్ మీడియానే ప్రధాన వేదికైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ట్విట్టర్ లో ఎలాంటి ఆపద తన కంటపడినా చలించి స్పందించే సోనూకు ట్విట్టర్ భారీ కుటుంబంగా మారిపోయింది. అలాంటి ఆయన ట్విట్టర్ కుటుంబం ఇప్పుడు ఏకంగా ఏడు మిలియన్ల మందికి చేరుకుంది. తాజాగా సోనూసూద్ ట్విట్టర్లో 7 మిలియన్ ఫాలోవర్స్ తో కొత్త మైల్ స్టోన్ ని టచ్ చేశాడు. ఇది ఎంతటి ఘనతంటే టాలీవుడ్ హీరోలలో ఒక్క మహేష్ బాబుకు తప్ప మరెవరికీ ఇంతటి ఫాలోయింగ్ లేదు. దీంతో పలువురు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read: Lucifer Remake: చిరుకు జోడీగా అనుష్క.. లూసిఫర్ లో హీరోయిన్ నిజమేనా?