AP 10th Results: ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల.. 67 శాతం ఉత్తీర్ణత

ఆంధ్ర ప్రదేశ్‌లో గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం ఉదయం ఫలితాలు విడుదల చేశారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు 6.15 లక్షల మంది హాజరుకాగా, 4.14 లక్షల మంది పాస్ అయ్యారు.

AP 10th Results: ఆంధ్ర ప్రదేశ్‌లో గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం ఉదయం ఫలితాలు విడుదల చేశారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు 6.15 లక్షల మంది హాజరుకాగా, 4.14 లక్షల మంది పాస్ అయ్యారు. 2.02 లక్షల మంది బాలురు, 2.11 లక్షల మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. 64.02 శాతం బాలురు, 70.70 శాతం బాలికలు పాసయ్యారు. మొత్తంగా 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ప్రకాశం జిల్లా 78.30 శాతంతో మొదటి స్థానంలో ఉంది.

ITBP New record: ఇరవై నాలుగు వేల అడుగుల ఎత్తులో యోగా.. ఐటీబీపీ సరికొత్త రికార్డు

49.70 శాతంతో అనంతపురం చివరి స్థానంలో ఉంది. 797 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత ఉంది. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ‘‘పక్క రాష్ట్రాలకంటే ముందుగానే ఫలితాలు ప్రకటించాం. వచ్చే నెల 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన వాళ్ల కోసం ఈ నెల 13 నుంచి స్పెషల్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నాం. సప్లిమెంటరీ పరీక్షల కోసం రేపటి (జూన్ 7) నుంచి ఫీజు చెల్లించవచ్చు’’ అని మంత్రి బొత్స తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు