ITBP New record: ఇరవై నాలుగు వేల అడుగుల ఎత్తులో యోగా.. ఐటీబీపీ సరికొత్త రికార్డు

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) అరుదైన రికార్డు సృష్టించారు. 24 వేల అడుగుల ఎత్తులో యోగా చేశారు. ఉత్తరాఖండ్‌లోని మౌంట్ అబి గామిన్ పర్వతంపై పర్వతారోహణ బృందానికి చెందిన ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు.

ITBP New record: ఇరవై నాలుగు వేల అడుగుల ఎత్తులో యోగా.. ఐటీబీపీ సరికొత్త రికార్డు

Itbp

ITBP: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) అరుదైన రికార్డు సృష్టించారు. 24 వేల అడుగుల ఎత్తులో యోగా చేశారు. ఉత్తరాఖండ్‌లోని మౌంట్ అబి గామిన్ పర్వతంపై పర్వతారోహణ బృందానికి చెందిన ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు. ఈ పర్వతం దాదాపు 24,131 అడుగుల ఎత్తు ఉంటుందని అంచనా. యోగా చేసే సమయంలో ఈ పర్వతం పూర్తిగా మంచుతో కప్పి ఉంది. ఎత్తైన పర్వతంపై మంచులో నిలబడి, ‘బద్రి విశాల్ కీ జై’ అని నినాదాలతో ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు. దాదాపు 230 మంది వరకు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tiger Scare: 18 రోజులైనా చిక్కని పులి

ఈ నెల 21 జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అబి గామిన్ పర్వతం సెంట్రల్ హిమాలయాలలోని జస్కర్ రేంజ్‌లో ఉంటుంది. అబి గామెన్ ఈ ప్రాంతంలో ఉన్న రెండో అతిపెద్ద పర్వతం. ఇండియా-టిబెట్ సరిహద్దులు పహారా కాసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన దళమే ఐటీబీపీ. ఈ దళానికి పర్వతారోహణలోనూ మంచి పట్టు ఉంటుంది. మంచు వాతావరణంలో కూడా పనిచేస్తారు.