Minister Botsa Satyanarayana: ఏపీకి వచ్చిచూడు.. అసలు విషయం తెలుస్తుంది.. హరీశ్‌రావు వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్ ..

ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఒక్కసారి ఏపీకి వచ్చి చూస్తే టీచర్లకు మా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తుందని బొత్స అన్నారు.

Minister Botsa Satyanarayana: ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారని, ఏపీ, తెలంగాణలో ఇచ్చిన పీఆర్‌సీలలో తేడాచూస్తే తెలుస్తుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మాట్లాడిన హరీశ్ రావు .. తెరాస ప్రభుత్వం ఉపాధ్యాయులతో ఎంత స్నేహపూర్వకంగా ఉందో గమనించాలని సూచించారు. ఏపీలో ఉపాధ్యాయులను కేసులు పెట్టి లోపల వేస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. హరీశ్ వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇచ్చారు.

Mukesh Ambani: ముకేశ్ అంబానీకి జెడ్ ప్లస్ భద్రత.. ఎంత మంది కమాండోలు రక్షణగా ఉంటారో తెలుసా?

హరీశ్ రావు మా ప్రభుత్వంపై మాట్లాడి ఉండకపోవచ్చునని, ఒకవేళ అలా మాట్లాడి ఉంటే.. ఒక్కసారి ఏపీకి వచ్చి చూస్తే టీచర్లకు మా ప్రభుత్వం చేసినవి తెలుస్తాయని అన్నారు. ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారని, ఏపీ, తెలంగాణలో ఇచ్చిన పీఆర్‌సీలలో తేడాచూస్తే తెలుస్తుందని బొత్స అన్నారు. ఇదిలాఉంటే అమరావతి రైతులు పాదయాత్రపై బొత్స మాట్లాడారు.. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ యాత్ర చేస్తోందని ఆరోపించారు. మేము విశాఖను దోచుకోవాలంటే ఎప్పుడో సగం మా జేబులో ఉండేదని, దేవుడి దయవల్ల మా తాతలు, తండ్రి ఇచ్చిన ఆస్తి ఉందని, ఇంటర్ చదివే రోజుల్లోనే అంబాసిడర్ కారులో తిరిగేవాడనంటూ బొత్స అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

విశాఖ రుషికొండలో పాత హోటల్ స్థానంలో కొత్త హోటల్ కడితే తప్పేంటని బొత్స ప్రశ్నించారు. రుషికొండలో నిర్మాణాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు