Mukesh Ambani: ముకేశ్ అంబానీకి జెడ్ ప్లస్ భద్రత.. ఎంత మంది కమాండోలు రక్షణగా ఉంటారో తెలుసా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భద్రతను జెడ్ ప్లస్ (Z+) కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. అంబానీకి అంతకుముందు జెడ్ కేటగిరీ భద్రత ఉంది.

Mukesh Ambani: ముకేశ్ అంబానీకి జెడ్ ప్లస్ భద్రత.. ఎంత మంది కమాండోలు రక్షణగా ఉంటారో తెలుసా?

Mukesh ambani

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భద్రతను జెడ్ ప్లస్ (Z+) కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. అంబానీకి అంతకుముందు జెడ్ కేటగిరీ భద్రత ఉంది. ఇందులో పైలట్, ఫాలో-అప్ వాహనాలతో పాటు సాయుధ కమాండోలు ముంబై, భారతదేశంలోని మరేదైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అతనికి భద్రత కల్పిస్తారు. ఈ ఏడాది ఆగస్టులో అంబానీ, అతని కుటుంబానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ముంబైలోని బోరివలి వెస్ట్ ప్రాంతంలో ఒక వ్యక్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బెదిరింపు కాల్స్‌పై రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Xi Jinping: ఎగ్జిబిషన్‌కు హాజరైంది ఒరిజినల్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కాదా? ఆయన డూపా? అనుమానాలు ఎందుకంటే?

గత ఏడాది ముకేశ్ అంబానీ నివాసం యాంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఎస్‌యూవీని నిలిపి ఉంచిన తర్వాత ముఖేష్ అంబానీ భద్రతకు పెద్దపీట వేశారు. జడ్ కేటగిరి భద్రత కల్పించారు. ముంబైలోని ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు భద్రతను కొనసాగించడానికి 2020 జూలైలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది. ముకేష్‌కు భద్రత కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై త్రిపుర హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సవాలు చేయడంతో సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. ముకేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడాన్ని సవాలు చేసిన పిఐఎల్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ స్టే విధించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జెడ్ ప్లస్ భద్రత అంటే రక్షణలో రెండవ అత్యధిక స్థాయిని కలిగి ఉంటుంది. ముకేశ్ అంబానీ ఇకనుంచి జెడ్ ఫ్లస్ సెక్యూరిటీ కలిగి ఉంటాడు. దీంతో 58 మంది కమాండోలు అంబానీకి రక్షణగా ఉంటారు. అయితే, భద్రతకు అయ్యే ఖర్చును ముఖేష్ అంబానీ భరిస్తారని తెలుస్తోంది.