Xi Jinping: ఎగ్జిబిషన్‌కు హాజరైంది ఒరిజినల్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కాదా? ఆయన డూపా? అనుమానాలు ఎందుకంటే?

బీజింగ్‌లో జరిగిన ఓ ప్రదర్శనకు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ మాస్క్ ధరించి హాజరై తిలకించారని ప్రభుత్వ అధికారిక మీడియా కొన్ని ఫొటోలను, దృశ్యాలను విడుదల చేసింది.  అయితే, ఇవి నిజమైన జిన్‌పింగ్ ఫొటోలు కాదని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Xi Jinping: ఎగ్జిబిషన్‌కు హాజరైంది ఒరిజినల్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కాదా? ఆయన డూపా? అనుమానాలు ఎందుకంటే?

Xi Jinping

Xi Jinping: ఉజ్బెకిస్థాన్ సమర్కండ్‌లో ఇటీవల జరిగిన షాంఘై సహకార సంఘం సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పాల్గొన్నారు. అక్కడి నుంచి బీజింగ్‌కు తిరిగి వచ్చాక ఆయన మళ్లీ బయటకి రాకపోవడంతో గృహనిర్బంధం వార్తలు గుప్పుమన్నాయి. త్వరలో జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాల్లో జిన్‌పింగ్‌ను మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉందని, ఇంతలోనే ఆయనపై తిరుగుబాటు, హౌస్ అరెస్ట్ లాంటి కథనాలు బయటకు వస్తున్నాయి. మరోవైపు చైనా కమ్యూనిస్ట్ పార్టీ కానీ, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్‌ఏ కానీ ఈ పుకార్లను ఖండించలేదు. దీంతో పుకార్లకు చెక్ పెట్టేందుకు చైనా అధికారిక మీడియా విడుదల చేసిన జిన్‌పింగ్ దృశ్యాలు, ఫొటోలపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Russia vs Ukraine War: రేపు రష్యాలో విలీనం కానున్న నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలు .. రష్యా తీరుపై ప్రపంచ దేశాలు ఏమన్నాయంటే?

బీజింగ్‌లో జరిగిన ఓ ప్రదర్శనకు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ మాస్క్ ధరించి హాజరై తిలకించారని ప్రభుత్వ అధికారిక మీడియా కొన్ని ఫొటోలను, దృశ్యాలను విడుదల చేసింది.  అయితే, ఇవి నిజమైన జిన్‌పింగ్ ఫొటోలు కాదని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజా ఫొటోలో జిన్‌పింగ్ కుడి చెవి పూర్తిగా వేరుగా ఉందని, అలాగే ఆయన గొంతుకు గతంలో మాదిరిగా డబల్ చిన్ కనపడటం లేదని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. జిన్‌పింగ్ వయస్సు 70ఏళ్లు.. చైనా మీడియా విడుదల చేసిన దృశ్యాల్లో పదేళ్లు తక్కువ వయసున్న వ్యక్తి మాదిరిగా కనిపిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ఎగ్జిబిషన్ కు హాజరైంది ఒరిజినల్ జిన్ పింగ్ కాదని, ఆయన డూప్ అన్న అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు. జిన్‌పింగ్ డూప్‌తో పుకార్లకు చెక్ పెట్టాలని చైనా అధికారిక మీడియా యత్నిస్తోందని నిపుణులు అనుమానిస్తున్నారు. నిపుణుల అనుమానాలు నిజమా? కాదా అనే విషయంపై స్పష్టత రావాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.