Russia vs Ukraine War: రేపు రష్యాలో విలీనం కానున్న నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలు .. రష్యా తీరుపై ప్రపంచ దేశాలు ఏమన్నాయంటే?

ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రేపు రష్యాలో విలీనం కానున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపు (శుక్రవారం) విలీనానికి సంబంధించి సంతకం చేస్తారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ప్రకటించారు. అయితే రష్యా తీరును ప్రపంచంలోని పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.

Russia vs Ukraine War: రేపు రష్యాలో విలీనం కానున్న నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలు .. రష్యా తీరుపై ప్రపంచ దేశాలు ఏమన్నాయంటే?

Putin vs Zelensky

Russia vs Ukraine War: ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రేపు రష్యాలో విలీనం కానున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపు (శుక్రవారం) విలీనానికి సంబంధించి సంతకం చేస్తారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ప్రకటించారు. రష్యన్ ఫెడరేషన్‌లో కొత్త భూభాగాల ప్రవేశానికి సంబంధించిన ఒప్పందాలపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంతకం కార్యక్రమం జరుగుతుందని పెస్కోవ్ చెప్పారు. సంతకాల వేడుక అనంతరం పుతిన్ ప్రధాన ప్రసంగం చేస్తారని, ఉక్రేనియన్ ప్రాంతాల్లో మాస్కో నియమించిన నిర్వాహకులతో సమావేశమవుతారని పెస్కోవ్ వెల్లడించారు.

Russia ukraine war :పుతిన్‌ VS జెలెన్‌స్కీ..ధరించే డ్రెస్సులతోనే ప్రపంచానికి సందేశం..టీ షర్టుల వెనుక ఉన్న అసలు విషయం..

ఉక్రెయిన్‌లో తమ ఆధీనంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో రెఫరెండం పూర్తైనట్లు రష్యా ప్రకటించింది. అక్కడి ప్రజలు రష్యాలోనే ఉండాలని కోరుకున్నారని, రెఫరెండంలో తాము విజయం సాధించామని వెల్లడించింది. లుహాన్స్క్‌, డోనెట్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియాలో నాలుగు రోజుల పాటు రెఫరెండం నిర్వహించారు. ఆయా ప్రాంతాల ప్రజలు రష్యాలో ఉండాలనుకుంటున్నారా.. ఉక్రెయిన్‌లోనే ఉండాలనుకుంటున్నారా.. అన్న అంశంపై ఓటింగ్‌ నిర్వహించారు. ఓట్లు లెక్కించారు. ఈ నాలుగు ప్రాంతాల్లో అధికశాతం మంది రష్యాకే అనుకూలంగా ఓటేశారు. ఈ ప్రాంతాలను రష్యాలో అధికారికంగా విలీనం చేయడంపై అధ్యక్షుడు పుతిన్‌ శుక్రవారం ప్రకటన చేస్తారు.

Russia ukraine war :పుతిన్‌ VS జెలెన్‌స్కీ..ధరించే డ్రెస్సులతోనే ప్రపంచానికి సందేశం..టీ షర్టుల వెనుక ఉన్న అసలు విషయం..

అయితే, ఈ రిఫరెండం ఫలితాల ప్రకటన తర్వాత యుద్ధాన్ని రష్యా మరో ఎత్తుకు తీసుకెళ్తుందని కొందరు భావిస్తున్నారు. ఆక్రమిత ప్రాంతాలను రష్యా తమ భూభాగంలో కలిపేసుకుంటే ఈ యుద్ధం మరింత ప్రమాదకరంగా మారే అవకాశముంది. ఎందుకంటే ఈ ప్రాంతాలను మళ్లీ యుక్రెయిన్ తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే, తమ మాతృభూమిపై దాడి జరిగినట్లుగా భావించి, మరింత ధీటుగా రష్యా స్పందించే అవకాశముంటుంది. మరోవైపు తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు అణ్వాయుధాలను ఉపయోగించేందుకు కూడా వెనుకాడబోమని రష్య అధ్యక్షుడు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రష్యా తీరుతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఓటింగ్ అక్రమమని చాలా పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. మరోవైపు రష్యా మిత్ర దేశాల్లో ఒకటైన, రష్యాపై ఆంక్షలకు దూరంగా ఉంటున్న సెర్బియా కూడా ఈ ఓటింగ్‌ను తాము గుర్తించబోమని ప్రకటించడం గమనార్హం. దేశాల సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను గౌరవించాలనే తమ సూత్రాలకు ఈ ఓటింగ్ పూర్తి విరుద్ధంగా జరిగిందని సెర్బియా విదేశాంగ మంత్రి నికోలా సెలకోవిక్ వ్యాఖ్యానించారు. అయితే, అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతుండటంతో, ఈ ఓటింగ్‌ను ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ చెప్పారు.