US Urges Its Citizens In Russia to Leave: ‘వెంటనే రష్యాను విడిచి వచ్చేయండి’.. తమ పౌరులకు అమెరికా సూచన

పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ నిన్న ప్రకటన చేయడంతో ఆ దేశంలోని తమ పౌరులకు అమెరికా మరో కీలక సూచన చేసింది. రష్యా నుంచి విదేశాలకు వెళ్లడానికి అవకాశాలు ఉన్నాయని, వీటిని వాడుకోవాలని చెప్పింది. రష్యా నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారికి రష్యా అనుమతులు ఇవ్వకపోవచ్చని తెలిపింది. విదేశాలకు వెళ్లకుండా రష్యా నిరోధించే అవకాశమూ ఉందని పేర్కొంది. ఇప్పటికే కమర్షియల్ విమానాలు కొన్నే అందుబాటులో ఉంటున్నాయని తెలిపింది.

US Urges Its Citizens In Russia to Leave: ‘వెంటనే రష్యాను విడిచి వచ్చేయండి’.. తమ పౌరులకు అమెరికా సూచన

US Urges Its Citizens In Russia to Leave: పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ నిన్న ప్రకటన చేయడంతో ఆ దేశంలోని తమ పౌరులకు అమెరికా మరో కీలక సూచన చేసింది. వెంటనే రష్యాను విడిచి వచ్చేయాలని చెప్పింది. యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఎదురుదెబ్బలు తింటున్న నేపథ్యంలో.. మూడు లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్టు పుతిన్‌ ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమ దేశాలను ఎదుర్కొనేందుకు, తమ భూభాగాలను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అంతేగాక, సైనిక సమీకరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై కూడా ఆయన సంతకాలు చేశారు. దీంతో రష్యాలోని విదేశీయులు ఆందోళన చెందుతున్నారు.

రష్యా ప్రజలతో పాటు విదేశీయులు ఆ దేశం నుంచి వెళ్లిపోతుండడంతో సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్దీ రద్దీ కనపడుతోంది. కమర్షియల్ విమానాలు కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఆ దేశం నుంచి వెళ్లిపోవడం క్లిష్టతరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయం అగ్రరాజ్యం పౌరులను అప్రమత్తం చేస్తూ ఓ సూచన చేసింది.

రష్యా నుంచి విదేశాలకు వెళ్లడానికి అవకాశాలు ఉన్నాయని, వీటిని వాడుకోవాలని చెప్పింది. రష్యా నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారికి రష్యా అనుమతులు ఇవ్వకపోవచ్చని తెలిపింది. విదేశాలకు వెళ్లకుండా రష్యా నిరోధించే అవకాశమూ ఉందని పేర్కొంది. ఇప్పటికే కమర్షియల్ విమానాలు కొన్నే అందుబాటులో ఉంటున్నాయని తెలిపింది. కాగా, రష్యాలో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

“నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”.. https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రష్యాలో మార్షల్ చట్టం విధించే అవకాశం ఉందని ఆ దేశ పౌరులు భావిస్తున్నారు. మార్షల్ చట్టం విధిస్తే ప్రభుత్వ పరిపాలన అంతా సైనిక వ్యవస్థ చేతుల్లోకి వెళ్లిపోయి, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉంటాయి. రష్యా ప్రజలు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. యుక్రెయిన్ లో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు పుతిన్ ప్రకటించినప్పటి నుంచి రష్యా-ఐరోపా సమాఖ్య మధ్య విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి.

Mamata Banerjee plays ‘dhaank’: హుషారుగా ఢంకా మోగించిన మమతా బెనర్జీ.. వీడియో వైరల్