AP Corona Cases : ఏపీలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11వేల 573 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ తో చనిపోయారు.

Ap Corona Cases

AP Corona Cases : ఏపీలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11వేల 573 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ తో చనిపోయారు. చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 9వేల 445 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఒక లక్షా 15వేల 425 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40వేల 357 కోవిడ్ టెస్టులు చేశారు. శుక్రవారం ఒక్కరోజే 12వేల 516 కరోనా కేసులు, 12 మరణాలు నమోదవగా.. శనివారం ఆ సంఖ్య తగ్గింది.

Telangana Corona : థర్డ్ వేవ్ ముగియలేదు.. మరిన్ని వేరియంట్లు రెడీగా ఉన్నాయి!

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా చూస్తే.. కడప జిల్లాలో అత్యధికంగా 1,942 కేసులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో 1522, గుంటూరు జిల్లాలో 1298 కేసులు వెలుగు చూశాయి.