Telangana Corona : థర్డ్ వేవ్ ముగియలేదు.. మరిన్ని వేరియంట్లు రెడీగా ఉన్నాయి!

గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 173 మంది కరోనా పేషెంట్లు ట్రీట్‌మెంట్ పొందుతుండగా... 169 మందికి నిలకడగా ఉంది. మిగిలిన నలుగురికి మాత్రం సీరియస్‌గా ఉందని..

Telangana Corona : థర్డ్ వేవ్ ముగియలేదు.. మరిన్ని వేరియంట్లు రెడీగా ఉన్నాయి!

Gandhi Hospital

Gandhi Hospital : తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ కొత్తగా 3 వేలకు పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌తో రాష్ట్రంలోనూ థర్డ్‌వేవ్‌ ప్రభావం కనిపిస్తోంది. గతేడాది ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ఓవైపు ఒమిక్రాన్… మరోవైపు డెల్టా విజృంభణతో కరోనా కేసులు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన గురిచేస్తున్నాయి. థర్డ్‌వేవ్‌తో కరోనా కాలం ముగిసినట్లు కాదు… మరిన్ని వేరియంట్లు ప్రజలపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు హెచ్చరించారు.

Read More : NBK 107 : బాబు రెడీ బాబు.. ఈసారి నాలుగు భాషల్లో!

ఇప్పుడు నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 95 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులేనని తెలిపారు. మిగతా ఐదు శాతం మాత్రం డెల్టా కేసులని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 173 మంది కరోనా పేషెంట్లు ట్రీట్‌మెంట్ పొందుతుండగా… 169 మందికి నిలకడగా ఉంది. మిగిలిన నలుగురికి మాత్రం సీరియస్‌గా ఉందని.. అయితే దానికి వారి ఇతర ఆరోగ్య సమస్యలని డాక్టర్ రాజారావు చెప్పారు. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లతో ప్రెగ్నెన్సీ లేడీస్‌, చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నప్పటికీ… ఆస్పటలైజేషన్‌ తక్కువేనన్నారు. ప్రస్తుతం ఇంట్లో ఒకరికి కరోనా వస్తే అందరూ దాని బారిన పడుతున్నారని డాక్టర్ రాజారావు తెలిపారు.

Read More : Azam Khan : ఒకేస్థానం నుంచి ఆజంఖాన్ భార్య, కొడుకు నామినేషన్లు

మరోవైపు…శుక్రవారం 3 వేల 944 కేసులు నమోదయ్యాయని, ముగ్గురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 39 వేల 520 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 4 వేల 081 మంది చనిపోయారని పేర్కొంది. అలాగే…ఒక్కరోజులో 2 వేల 444 మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,07,498 ఉందని పేర్కొంది.