Azam Khan : ఒకేస్థానం నుంచి ఆజంఖాన్ భార్య, కొడుకు నామినేషన్లు

ఆజంఖాన్ తనయుడిపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఫోర్జరీ, భూ ఆక్రమణ కేసులో ఆజంఖాన్, ఆయన భార్య, కుమారుడిపై ఆరోపణలు రావడంతో వీరు రామ్ పూర్ కోర్టులో లొంగిపోయారు. అనంతరం

Azam Khan : ఒకేస్థానం నుంచి ఆజంఖాన్ భార్య, కొడుకు నామినేషన్లు

Azmkhan

Azam Khan’s Son, Wife File Nomination : సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎంపీ ఆజంఖాన్ కొడుకు మహ్మద్ అబ్దుల్లా, ఆజంఖాన్ సతీమణి తనీజ్ ఫత్మా ఒకే నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలబడడం చర్చనీయాంశమైంది. వీరిద్దరూ 2022, జనవరి 28వ తేదీ రామ్ పూర్ జిల్లా సువార్ అసెంబ్లీ స్థానానికి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎస్పీ అభ్యర్థులుగా వీరు నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అయితే.. అందరి దృష్టి మాత్రం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంపై ఉంది. యూపీ ఎన్నికలు దేశానికి మార్గనిర్దేశనం చేస్తాయని భావిస్తున్నారు.

Read More : Ukraine Tension: అమెరికా – ఉక్రెయిన్ – రష్యాల మధ్య భారత్ ఎక్కడ?

ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షమైన ఎస్పీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే..సమాజ్ వాదీ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆజంఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. భూ కబ్జాలు, ఇతర ఆరోపణలతో 2020 ఫిబ్రవరి నుంచి జైలులో ఉంటున్నారు. ఆజంఖాన్ తనయుడిపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఫోర్జరీ, భూ ఆక్రమణ కేసులో ఆజంఖాన్, ఆయన భార్య, కుమారుడిపై ఆరోపణలు రావడంతో వీరు రామ్ పూర్ కోర్టులో లొంగిపోయారు. అనంతరం ఫత్మాకు 2020లో బెయిల్ రాగా..అబ్దుల్లా ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. ఆజంఖాన్ ఎనిమిదిసార్లు ఎన్నికై, ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు.

Read More : Gollapudi Maruthi Rao Wife: గొల్లపూడి మారుతీరావు భార్య కన్నుమూత

మొత్తం యూపీలో 403 సీట్లు ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఫిబ్రవరి 10 (1వ దశ).
ఫిబ్రవరి 14 (2వ దశ).
ఫిబ్రవరి 20 (3వ దశ).

Read More : Odisha : సర్పంచ్ ఎన్నిక కోసం.. భార్య మెడలో మరోసారి తాళి కట్టాడు!

ఫిబ్రవరి 23 (4వ దశ).
ఫిబ్రవరి 27 ( 5వ దశ).
మార్చి 3 (6వ దశ).
మార్చి 7 (7వ దశ).