Koffee with Karan : మీ అన్న నీ ఫ్రెండ్స్ ఎంతమందితో బెడ్ షేర్ చేసుకున్నాడు.. అన్నా చెల్లిల్లని కూడా వదలని కరణ్ జోహార్..
ఈ ప్రోమోలో కరణ్.. సోనమ్‌తో అర్జున్ గురించి అడుగుతూ.. నీ ఫ్రెండ్స్‌లో ఎంతమందితో అర్జున్ కపూర్ బెడ్ షేర్ చేసుకున్నాడు? అని.........
- Saketh U
- Published On : August 10, 2022 / 08:10 AM IST
koffee with karan
Koffee with Karan : బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ ఇటీవలే మొదలైంది. ఇప్పటికే అయిదు ఎపిసోడ్స్ పూర్తవగా ఆరో ఎపిసోడ్ లో అర్జున్ కపూర్, సోనమ్ కపూర్ గెస్టులుగా వచ్చారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. సాధారణంగా కరణ్ తన షోలో పర్సనల్ క్వశన్స్, సెక్స్ లైఫ్ మీద కూడా ప్రశ్నలు వేస్తాడు. కొన్ని సార్లు అవతలి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నా కరణ్ అదేమీ పట్టించుకోడు. ప్రతి ఎపిసోడ్ లోనూ ఈ ప్రశ్నలు కచ్చితంగా అడుగుతాడు. తాజాగా రిలీజైన ప్రోమోలో అన్నాచెల్లెళ్లయిన అర్జున్ కపూర్, సోనమ్ కపూర్ రాగా వాళ్ళని కూడా ఇవే ప్రశ్నలు అడిగాడు.
ఈ ప్రోమోలో కరణ్.. సోనమ్‌తో అర్జున్ గురించి అడుగుతూ.. నీ ఫ్రెండ్స్‌లో ఎంతమందితో అర్జున్ కపూర్ బెడ్ షేర్ చేసుకున్నాడు? అని అడిగాడు. దీనికి సోనమ్.. దాని గురించి నేనిప్పుడు మాట్లాడలేను. అయినా నాకలాంటి బ్రదర్స్ లేరు అని చెప్తే మరెలాంటి బ్రదర్స్ ఉన్నారు అని మళ్ళీ అడిగాడు కరణ్. దీంతో అర్జున్ మధ్యలో కల్పించుకొని నువ్వెలాంటి సిస్టర్‌వి? ఏం చెప్తున్నావు? సోనమ్‌తో ట్రోల్ చేయించడానికే నన్ను ఈ షోకి పిలిచారా? అని అడిగాడు. ఈ ఫుల్ ఎపిసోడ్ గురువారం హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ అవ్వనుంది.
ఇప్పటికే కరణ్ అడిగే సెక్స్ ప్రశ్నలకి అమీర్ ఖాన్ కౌంటర్ ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సి కూడా కరణ్ కి కౌంటర్ ఇచ్చింది. అయినా కరణ్ ఇలాంటి ప్రశ్నలు అడగటం మానట్లేదు. ఇక అన్నా చెల్లెల్లు వచ్చిన ఎపిసోడ్ లో కూడా ఇలాంటి ప్రశ్నలు అడగడంతో నెటిజన్లు మరోసారి కరణ్ ని ట్రోల్ చేస్తున్నారు.
