Anushka Sharma Beauty Secret : అనుష్క శర్మ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. మీరు కూడా ఇంట్లో ఈజీగా ట్రై చేయొచ్చు..

అనుష్క శర్మ మాట్లాడుతూ.. ''నా స్మూత్ స్కిన్ కోసం నేను పాటించే చిట్కా ఒకటే. ఫేస్‌ ప్యాక్‌ వాడతాను. కొంచెం పెరుగు, రోజ్‌ వాటర్‌, కాసింత వేపాకు పొడి వేసి బాగా కలిపి.............

Anushka Sharma Beauty Secret : అనుష్క శర్మ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. మీరు కూడా ఇంట్లో ఈజీగా ట్రై చేయొచ్చు..

Anushka Sharma Beauty Secret :  హీరోయిన్స్ కి అందాన్ని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. బాలీవుడ్ హీరోయిన్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఒక బిడ్డకి తల్లి అయినా ఇంకా అంతే అందాన్ని మెయింటైన్ చేస్తుంది. పెళ్లి, పిల్లలతో కొన్నాళ్ళు సినిమాలకి గ్యాప్ ఇచ్చి త్వరలో మళ్ళీ సినిమాల్లోకి రాబోతుంది. కొన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చినా తన అందం మాత్రం తగ్గలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అందానికి గల సీక్రెట్ చెప్పింది.

Kangana Ranaut : డెంగ్యూ వచ్చినా షూట్ కి వచ్చిన హీరోయిన్.. ఒక పక్క మెయిన్ లీడ్.. మరోపక్క డైరెక్టర్ గా..

అనుష్క శర్మ మాట్లాడుతూ.. ”నా స్మూత్ స్కిన్ కోసం నేను పాటించే చిట్కా ఒకటే. ఫేస్‌ ప్యాక్‌ వాడతాను. కొంచెం పెరుగు, రోజ్‌ వాటర్‌, కాసింత వేపాకు పొడి వేసి బాగా కలిపి మొహానికి, మెడకు అప్లయ్‌ చేస్తాను. అది ఆరిపోయాక చన్నీళ్లతో మొహం కడిగేసుకుంటాను. రెగ్యులర్ గా ఈ ఫేస్ ప్యాక్ ని వాడతాను. నేను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు పింపుల్స్ ఎక్కువగా వచ్చేవి. అప్పుడు మా అమ్మ ఈ చిట్కా చెప్పింది. అప్పట్నుంచి ఇదే వాడుతున్నాను. అందుకే నా ఫేస్ చాలా సున్నితంగా ఉంటుంది. ఇదే నా అందానికి సీక్రెట్” అని చెప్పింది.