Arjun Sarja Comments On Vishwak Sen
Arjun Sarja: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరుకావడంతో, ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో అర్జున్ తన కూతురు ఐశ్వర్య సర్జాను తెలుగు తెరకు హీరోయన్‌గా పరిచయం చేయాలని చూశాడు.
Arjun Sarja: హీరోయిన్ గా అర్జున్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. హీరో ఎవరంటే?
సినిమా ప్రారంభమై రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ మాత్రం జరగడం లేదని తాజాగా హీరో కమ్ డైరెక్టర్ అర్జున్ సర్జా వాపోయాడు. ఆయన ఈ సినిమాపై వస్తున్న వార్తలకు సంబంధించి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా నుండి విశ్వక్ సేన్ వాకౌట్ చేసినట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయని.. తనకు తెలిసైతే ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదని అర్జున్ చెప్పుకొచ్చాడు. అయితే సినిమా షూటింగ్ ఇంకా ఎందుకు మొదలుకాలేదనే విషయంపై కూడా ఆయన వివరణ ఇచ్చాడు. నిజానికి మొదటి షెడ్యూల్‌ను కేరళలో షూట్ చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నామని.. విశ్వక్‌తో తాను చాలా సార్లు కథ విషయంలో, రెమ్యునరేషన్ విషయంలో డిస్కస్ చేశానని ఆయన చెప్పారు. అయితే తొలి షెడ్యూల్‌కు అందరూ సిద్ధంగా ఉన్న సమయంలో విశ్వక్ సేన్ మేనేజర్ హీరోకు మరికొంత సమయం కావాలని చెప్పడంతో తొలి షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేశామని అన్నారు.
Vishwak Sen : మరోసారి వార్తల్లో విశ్వక్‌సేన్.. వాటిని డిలీట్ చేయండి అంటూ హంగామా..
ఇక సినిమా మరింత ఆలస్యం అవుతుండటంతో తాను విశ్వక్‌కు కొన్ని వందల సార్లు ఫోన్ చేశానని.. అయితే ఆయన నుండి సరైన రెస్పాన్స్ మాత్రం రావడం లేదని అర్జున్ సర్జా తెలిపారు. ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు మొదలుకొని ఇప్పుడున్న ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల వరకు చాలా కమిటెడ్‌గా వర్క్ చేస్తున్నారని.. కానీ తన సినిమాకు విశ్వక్ సేన్ ఇలా ఎందుకు చేస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని అర్జున్ మీడియా ముందు తన గోడును వెల్లబోసుకున్నాడు. మరి ఈ వివాదంపై విశ్వక్ సేన్ ఏమంటాడో చూడాలి.