Arjun Sarja: హీరోయిన్ గా అర్జున్‌ కూతురు టాలీవుడ్‌ ఎంట్రీ.. హీరో ఎవరంటే?

దక్షిణాది సినిమా రంగంలో దాదాపు అన్ని భాషలలో నటించిన హీరో యాక్షన్ కింగ్ అర్జున్. తెలుగులో అప్పట్లో అర్జున్ కి తిరుగులేని మార్కెట్ ఉండేది.

Arjun Sarja: హీరోయిన్ గా అర్జున్‌ కూతురు టాలీవుడ్‌ ఎంట్రీ.. హీరో ఎవరంటే?

Arjun Sarja

Updated On : May 20, 2022 / 9:33 AM IST

Arjun Sarja: దక్షిణాది సినిమా రంగంలో దాదాపు అన్ని భాషలలో నటించిన హీరో యాక్షన్ కింగ్ అర్జున్. తెలుగులో అప్పట్లో అర్జున్ కి తిరుగులేని మార్కెట్ ఉండేది. దాదాపు 150కి పైగా సినిమాలు చేసిన అర్జున్ తెలుగులో కూడా స్ట్రైట్ సినిమాలు ఎన్నో చేశాడు. హీరో నుండి విలన్ వరకు.. ధీటైన సపోర్టింగ్ పాత్రలను కూడా చేసిన అర్జున్ ఇప్పుడు తన వారసురాలిని కూడా తెలుగులో పరిచయం చేసే ప్రయత్నాలలో ఉన్నాడు.

Arjun Sarja : ‘ఖిలాడి’ లో ‘అర్జున్ భరద్వాజ్’ గా ‘యాక్షన్ కింగ్’

ఐశ్వర్య అర్జున్ ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేయగా.. లుక్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అయితే, ఎందుకో ఇంకా స్టార్ స్టేటస్ దక్కలేదు. కాగా, కన్నడలో తన సొంత బ్యానర్లో.. సొంత డైరెక్షన్లో ఐశ్వర్యను పరిచయం చేసిన అర్జున్, తెలుగులోను అదే తరహాలో ఆమెను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

Arjun Sarja: మూడేళ్ళ క్రితం మీటూ ఆరోపణలు.. ఇప్పుడు క్లీన్ చిట్!

ఇప్పటికే తన సొంత డైరెక్షన్‌లోనే ఓ స్క్రిప్ట్‌ కూడా రెడీ చేసుకున్న అర్జున్.. ఈసినిమా కోసం ఓ యంగ్ హీరోను వెతికే పనిలో ఉన్నాడట. తాజాగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విశ్వక్‌సేన్‌ను ఈ సినిమాలో హీరోగా చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు.