Amazing artist
Amazing artist : కొంతమంది తమ చిత్రాలను ప్రత్యేకంగా ఆర్టిస్ట్ లతో గీయించుకుంటారు. అయితే ట్రైన్ జర్నీలో ఉన్న ఆర్టిస్ట్ విష్ణు దినేషన్ తన తోటి ప్రయాణికుడికి తెలియకుండా అతని చిత్రాన్ని గీశాడు. అది చూసి ఆ ప్రయాణికుని ఆనందం మాటల్లో చెప్పలేం.
కొందరు ఆర్టిస్ట్‌లు తమ మనసుకి నచ్చిన చిత్రాలకు వెంటనే రూపమిస్తుంటారు. అయితే రైలు ప్రయాణంలో ఓ ఆర్టిస్ట్ తోటి ప్రయాణికుడికి తెలియకుండా గీసిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కంటిని ఆకర్షించిన ప్రదేశాలు, వ్యక్తుల చిత్రాలకు రంగులు అద్దేస్తారు ఆర్టిస్ట్ విష్ణు దినేషన్. అలాగే ఓ ట్రైన్ జర్నీలో తన తోటి ప్రయాణికుడి చిత్రాన్ని అలవోకగా గీసేసారు.
‘ తను రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ట్రైన్ చాలా ఖాళీగా కనిపించిందట.. లోయర్ బెర్త్‌లో ఒంటరిగా కూర్చున్న ఓ ప్రయాణికుడిని చూసి చిత్రం గీయడానికి మనసు ఆరాటపడిందట. ముఖ్యంగా అతను తనవైపు చూసినపుడు నవ్విన నవ్వు తనకు చిత్రం గీయడానికి ప్రేరణ ఇచ్చిందట. ఆ భావనను ఎప్పటికీ మర్చిపోలేను.. లైవ్ స్కెచ్’.. అంటూ దినేషన్ ఈ విషయాల్ని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను లక్షల సంఖ్యలో జనం చూసారు.
Amazing artist : షాంపూతో శివుని చిత్రం.. ఈ ఆర్టిస్ట్ స్టైలే వేరు..
దినేషన్ చిత్రం చూసి ‘అంత తక్కువ టైంలో అద్భుతంగా గీశారని కొందరు.. అసాధారణమైన ప్రతిభా పాటవాలు మీ సొంతం అని కొందరు’.. వ్యాఖ్యానించారు. ఇంతకీ ఈ చిత్రాన్ని ఆ ప్రయాణికుడు చూసాడా? లేదా? అని మీకు డౌట్ రావాలిగా.. దినేషన్ తాను గీసిన చిత్రాన్ని ఆ ప్రయాణికుడికి చూపించగానే ఆయన ఆనందం మాటల్లో చెప్పలేం.