Kashmiri artist turned autowala : జాతీయ అవార్డు గెలుచుకున్న కాశ్మీరీ ఆర్టిస్ట్.. ఆటో రిక్షా నడుపుతున్నాడు.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

అతనో ఫేమస్ కాశ్మీరీ ఆర్టిస్ట్. జాతీయ అవార్డు విన్నర్ కూడా.. కాలం కలిసి రాక ఆటో డ్రైవర్‌గా మారాడు. అయినా కళని వదిలి పెట్టకుండా ముందుకు సాగుతున్న ఆ ఆర్టిస్ట్ కథ తెలుసుకోవాలని ఉందా? చదవండి.

Kashmiri artist turned autowala : జాతీయ అవార్డు గెలుచుకున్న కాశ్మీరీ ఆర్టిస్ట్.. ఆటో రిక్షా నడుపుతున్నాడు.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

Kashmiri artist turned autowala

Updated On : April 21, 2023 / 12:34 PM IST

Kashmiri artist turned autowala :  అతనో గొప్ప కాశ్మీరి పేపర్ మాచే ఆర్టిస్ట్. ఆర్టిక పరిస్థితులు అనుకూలించక ఆటో డ్రైవర్‌గా మారాడు. ప్రభుత్వ అవార్డు వచ్చింది కానీ.. ఆసరా దొరకలేదు. అసలు అతనికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది.

precious gift for father : తండ్రికి కొడుకు ఇచ్చిన విలువైన బహుమతి .. చూడగానే ఆ తండ్రి కన్నీరు ఆగలేదు..

శ్రీనగర్ హవాల్ (Hawal ) ప్రాంతంలో నివాసం ఉంటే సయ్యద్ ఐజాజ్ షా (Syed Aijaz Shah) పేపర్ మాచే ఆర్టిస్ట్ (paper mache artist). తన చేతులతో అనేక కళాఖండాలను తయారు చేశాడు. అనేకమందికి శిక్షణ ఇచ్చాడు. 2006లో పేపియర్-మాచే కళలో అతను చేసిన అభివృద్ధికి గానూ టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ (Ministry of Textiles) నుండి జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. అతిథిగా అనేక దేశాలను సందర్శించాడు. అప్పట్లో జాతీయ అవార్డు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిందట. అయతే దానికి 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని షరతు పెట్టిందట. పాపం ఐజాజ్ 10వ తరగతి వరకూ చదువుకోకపోవడంతో ఉద్యోగం సాధించలేకపోయాడు. ఇక ఆ తరువాత తన కుటుంబాన్ని పోషించుకోవడానికి పేపర్ మాచే కళని వదిలిపెట్టి ఆటో కొనుగోలు చేయాల్సిన అవసరం వచ్చింది.

Orange Movie: ఆరెంజ్ రీ-రిలీజ్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అరుదైన రికార్డు!

ఈ కథంతా ఖవర్ ఖాన్ అనే వ్యక్తి ఐజాజ్ ఆటో ఎక్కడం ద్వారా మనందరికీ తెలిసింది. ఖవర్ ఖాన్ హస్తకళకు సరైన జీవనోపాధి లభించక ఐజాజ్ ఆటో నడపాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఐజాజ్ ఫోటోని పోస్ట్ చేస్తూ ట్విట్టర్‌లో సుదీర్థమైన పోస్ట్ పెట్టారు. పేపియర్ మాచే క్రాఫ్ట్ అనేది కాశ్మీర్‌లోని పర్షియా నుంచి వచ్చిందని చెబుతారు. ఈ కళలో ప్రావీణ్యుడైన ఐజాజ్ రోజంతా ఆటో నడుపుతూ కష్టపడి ఇంటికి వెళ్లాక కూడా తన ఆర్ట్‌ని కొనసాగిస్తున్నాడు. నిజంగా కళపట్ల అతనికున్న అంకిత భావానికి హ్యాట్యాఫ్ చెప్పాలి. అతని ఇంటి చుట్టుపక్కల వారు కూడా ఇదే కళలో ప్రావీణ్యులైనా జీవనోపాధి కోసం సెక్యూరిటీ గార్డ్‌లు, సేల్స్ మ్యాన్‌లు, పెయింటర్‌లుగా మారుతున్నారని ఐజాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వాలు కూడా కళను, కళాకారుల్ని గురించి, గౌరవిస్తేనే అవి కలకాలం నిలిచి ఉంటాయి. లేదంటే కాలగర్భంలో కలిసిపోతాయి.