Assam Homes Demolished: పోలీస్ స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇళ్లు కూల్చివేత

ఒక కేసులో నిందితుడి కస్టోడియల్ డెత్‌కు నిరసనగా పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు పెట్టారు అతడి వర్గీయులు. దీంతో ఆగ్రహించిన పోలీసులు నిప్పు పెట్టిన వాళ్లందరి ఇళ్లను కూల్చివేశారు. ఈ ఘటన అసోంలో జరిగింది.

Assam Homes Demolished: ఒక కేసులో నిందితుడి కస్టోడియల్ డెత్‌కు నిరసనగా పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు పెట్టారు అతడి వర్గీయులు. దీంతో ఆగ్రహించిన పోలీసులు నిప్పు పెట్టిన వాళ్లందరి ఇళ్లను కూల్చివేశారు. ఈ ఘటన అసోంలో జరిగింది. గత శుక్రవారం నాగోన్ జిల్లాలోని సలోనాబోరి అనే గ్రామానికి చెందిన సోఫికుల్ ఇస్లామ్ అనే వ్యక్తిని మద్యం తాగి ఉన్నాడనే కారణంతో పోలీసులు అరెస్టు చేశారు.

Telangana Rains : తెలంగాణాలో రాగల మూడు రోజులు వర్షాలు

తర్వాత రోజు.. అంటే శనివారం ఉదయం అతడు మరణించాడు. దీంతో పోలీసుల అదుపులో ఉండగా మరణించడం స్థానికులకు, అతడి సంబంధీకులకు కోపం తెప్పించింది. దీంతో వాళ్లంతా శనివారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. అయితే, ఇస్లాం మరణం విషయంలో పోలీసులు తమ తప్పేమీ లేదని వాదిస్తున్నారు. నిందితుడిని శనివారం ఉదయం అతడి భార్యకు అప్పగించామని, అప్పటికే అతడు అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అతడు మరణించాడని చెబుతున్నారు. కాగా, పోలీస్ స్టేషన్‌పై 40 మంది దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం బుల్డోజర్లు తీసుకుని, వాళ్లందరి ఇళ్లపైకి వెళ్లారు. నిందితులకు సంబంధించిన ఇండ్లను కూల్చివేశారు. ఈ ఘటనలో 21 మందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Andhra Pradesh : దొంగతనానికి వచ్చిన దొంగ మృతి

మరోవైపు కస్టడీలో నిందితుడు మరణించడంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పోలీసుల తప్పు ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కస్టడీలో నిందితుడు మరణించినంత మాత్రాన, పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడం సరైన చర్య కాదని పోలీసులు అంటున్నారు. కాగా, నిందితుల ఇండ్లను కూల్చివేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. నిందితుల ఇండ్లను కూల్చివేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అభిప్రాయపడింది.

ట్రెండింగ్ వార్తలు